ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో ఆర్మూర్ పట్టణంలో చోటు చేసుకుంది. సీఐ సత్య నారాయణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని నల్లపోచమ్మ గల్లికి చెందిన పాల్చి అభిలాష్ కూలి పని చేస్తూ జీవనాన్ని సాగించేవాడు. తీవ్ర ఆర్థిక ఒత్తిడితో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
