ఏడాదిన్నర కాలంగా మంత్రిమండలి లో జిల్లాకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇదే జిల్లాకు ప్రగతి ప్రతికూలంగా మారింది. బృహత్తర కార్యాల్లోనూ అధికారులను పరుగులు పెట్టించే నాధుడే లేకుండా పోయారు.
ఎంతో కాలంగా ఎదురు చుస్తున్న మంత్రి వర్గ విస్తరణలో ను జిల్లాకు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలో పాలన వ్యవస్థ మరింత మెరుగ్గా తీర్చి దిద్దే లా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
యువ సారథులు పాలనా పగ్గాలు అప్పగించింది. ఇంచార్జ్ మంత్రిగా సీనియర్ మంత్రి ని తప్పించి మొదటి సారి మంత్రి అయినా సీతక్క కు బాధ్యతలు అప్పగించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అనేక పథకాలు అమల్లోకి తెచ్చింది. లబ్ది దారాల ఖరారు లో పారదర్శకత తో ఆయా పథకాలు నిర్దేశించిన లక్ష్యంలా మేరకు సాగేలా యంత్రాంగం పరుగులు పెట్టాలి అందుకు తగ్గట్టుగా కొత్త సారథులు సైతం అధికారులను పురమాయించాలి.
ఈ మద్యే పోలీస్ కమిషనర్ గా యువ అధికారి సాయి చైతన్య కు మొదటిగా కమిషనర్ హోదా జిల్లా బాధ్యతలు అప్పగించింది. గంజాయి డ్రగ్స్ ల నుంచి విముక్తి చేయడాన్ని సవాల్ గా భావిస్తున్న ప్రభుత్వం ఆ విభాగంలో పనిచేస్తున్న యువ ఐపియస్ ను జిల్లాకు పంపింది.
ఆయన అందుకు తగ్గట్టుగానే మత్తు మహమ్మారి ఫై ఉక్కుపాదం మోపుతున్నారు. రాబోయే రోజుల్లో మరింత కఠిన కార్యచరణ కు సిద్ధం అవుతున్నారని సమాచారం.మరో పాలన సారథి జిల్లా కలెక్టర్.
సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న రాజీవ్ గాంధీ హనుమంతు ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన్ని స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ శాఖ స్పెషల్ సెక్రటరీ గా బదిలీ చేశారు.
అలాగే రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్గా, భూభారతి కమిషనర్ గానూ అదనపు బాధ్యతలు అప్పగించింది. నూతన జిల్లా కలెక్టర్ గా 2013 ఐఎఎస్ బ్యాచ్ కు చెందిన టీ.వినయ్ కృష్ణారెడ్డిని నియామకం అయ్యారు.
ఆయన గతంలో నల్గొండ జిల్లా కలెక్టర్ గా పనిచేసారు.పాలన, పోలీస్ సారథులు ఇద్దరు జిల్లాకు కొత్తగా బాధ్యత లోకి వచ్చిన వారే . మరో వైపు జిల్లా ఇంచార్జ్ మంత్రి గా సీతక్క నియామకం అయ్యారు.
ఆమె సైతం మొదటి మంత్రిగా పనిచేస్తున్నారు. అందులోనూ అత్యంత కీలకమైన గ్రామీనాబివృద్ది శాఖ మంత్రి గా ఉన్నారు. ఇదివరకు ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణ రావు ఏడాది లో మూడే సార్లు జిల్లాకు వచ్చారు.
ఆయన హైదరాబాద్ లేదంటే ఆయన సొంత సెగ్మెంట్ కు పరిమితం కావడంతో అధికారులు అధికార పార్టీ నేతలకు అందుబాటులో ఉండలేని పరిస్థితి ఉండే. కీలక నేతలు సైతం ఆయన దొరక లేదు.
ఇందిర్మ ఇల్లు ,రాజీవ్ యువవికాసం లాంటి బృహత్తర పథకాల్లో లబ్ది దారులను ఖరారు చేయడంలో ఇంచార్జి మంత్రి కీలకంకావడంతో పూర్తీ స్థాయి లో అందుబాటులో ఉండే వారికే ఇంచార్జ్ మంత్రి బాధ్యతలు ఇవ్వాలని కొందరు నేతలు సీఎం ను ఒత్తిడి చేసారు.
ఈ నేపథ్యంలో సీతక్క ను రంగంలోకి దించారు. ఇద్దరు యువ అధికారులతో కలిసి సీతక్క జిల్లాప్రగతి ని పరుగులు పెట్టిస్తారనే ఆశాభావం తో అధికార పార్టీ శ్రేణులు ఉన్నాయి
