నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది.
జుక్కల్ మండలంలోని మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన పొనుగంటి సాయిలు(37) భార్య సంగీత ఈ నెల 6న నిజామాబాద్ ఆస్పత్రిలో డెలివరీ అయ్యింది. కాగా.. వారికి కుమారుడు జన్మించి మృతి చెందినట్టు తెలిసింది..
దీంతో ఆమెకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఒకటవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
