HomeTelanganaNizamabadఅధికార పార్టీ లో సహకార సంబరం .....సింగిల్ విండోల్లో నామినేటెడ్ పదవులు .... జిల్లాలో 144...

అధికార పార్టీ లో సహకార సంబరం …..సింగిల్ విండోల్లో నామినేటెడ్ పదవులు …. జిల్లాలో 144 సంఘాల్లో 1872 మందికి దక్కనున్న పదవులు

అధికార పార్టీలో మరోసారి పదవుల పందేరానికి ప్రభుత్వం తెరలేపనుంది. వేలాది మంది కిందిస్థాయి నాయకులకు పదవుల కట్టబెట్టాలా ప్రణాళిక ఖరారు చేసింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు నామినేటెడ్‌ పద్ధతిలో పాలకమండళ్లు నియమించడానికి రంగం సిద్ధం చేసింది .

రాష్ట్రవ్యాప్తంగా 908 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా. అయిదేళ్లకొకసారి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కేవలం రైతులే ఇందులో వోటర్లు గా వుంటారు. డైరెక్టర్ లు గా గెలిచిన వారు ఛైర్మెన్ ను ఎన్నుకుంటారు ఛైర్మెన్ లు డీసీసీబీ డైరెక్టర్ లను ఎన్నుకుంటురు.

కానీ ప్రభుత్వం ఇప్పుడు సహకార సంఘాలకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌తో పాటు డైరెక్టర్‌ పోస్టులను కూడా నామినేటెడ్‌ పద్ధతిలోనే భర్తీ చేయనున్నారు. దీనితో సహకార ఎన్నికలు లేకుండానే పీఏసీఎస్ పాలక వర్గాలు కొలువుదీరనున్నాయి. సహకార సంఘాలకు పాలకమండళ్లు ఏర్పాటుచేశాకే జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీ), సహకార మార్కెటింగ్‌ సమాఖ్య(డీసీఎమ్మెస్‌)తోపాటు రాష్ట్రస్థాయిలో ఉన్న మార్క్‌ఫెడ్‌, టెస్కాబ్‌లకు కూడా ఇదే తరహాలో పాలకవర్గాలు ఏర్పాటుచేయనున్నరు –సహకారచట్టం ప్రకారం ప్రతి సొసైటీకి 13 మందితో పాలకవర్గం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

ఇందులో ఒకరు చైర్మన్‌, ఒకరు వైస్‌చైర్మన్‌, 11 మంది డైరెక్టర్లు ఉంటారు. ఎస్సీ మహిళ, ఎస్టీ జనరల్‌, బీసీ జనరల్‌… కేటగిరీలకు మూడు డైరెక్టర్‌ పోస్టులు రిజర్వు చేస్తారు. మిగిలిన 10 మంది డైరెక్టర్లను జనరల్‌ కేటగిరీలో భర్తీ చేయాల్సి ఉంటుంది.

ఇదే తరహాలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్‌ సమాఖ్య (డీసీఎమ్మెస్‌), రాష్ట్రస్థాయిలో మార్క్‌ఫెడ్‌, టెస్కాబ్‌ పాలకవర్గాలను కూడా నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేయనుంది.

అయితే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారితో మాత్రమే ఈ పదవుల్లో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. నిజామాబాద్ జిల్లాలో 144 సహకార సంఘాలుండగా 1872 మంది డైరెక్టర్ లను ప్రభుత్వం నియమించబోతుంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments