చాలా కాలం తరువాత నిజామాబాద్ నగరంలో అల్లరి మూకల అలజడి వెలుగులోకి వచ్చింది. బాధితులు సకాలంలో పోలీసులకు రప్పించిన వారి ముందే అల్లరి మూక స్వైర విహారం చేసింది.
నిజామాబాద్ నగరంలోని దుబ్బ ప్రాంతంలో పాత పోస్ట్ ఆఫీస్ వద్ద ఉండే అలంకార్ అర్జున్ ఇంటి ముందుకి శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆదర్శ నగర్ ప్రాంతానికి చెందిన ఓ మెకానిక్ తన ఇద్దరు కొడుకులతో పాటు సుమారు 20 మందికి వెంట వేసుకొని దాడికి తెగబడ్డారు.అప్పటికే నిద్రలో ఉన్న అర్జున్ ఈ అల్లరి మూకల అలజడి నిద్ర లేచినప్పటికీ తలుపులు తీసి బయటకు రాడానికి బయపడ్డారు.
తాగిన మైకంలో ఉన్న అల్లరి మూకలు అర్జున్ ఇంటి మీదికి రాళ్ళు రువ్వారు.కత్తులు,కర్రలతో తన ఇంటిముండే మోహరించి ఉండడంతో ఆందోళనకు గురైన అర్జున్ వెంటనే డయల్ 100 కు ఫిర్యాదు చేశారు.దీంతో మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఇద్దరు కానిస్టేబుల్ లు హుటాహుటిన అర్జున్ ఇంటి చేరుకున్నారు.
పోలీసుల ఎంట్రీతో చెల్ల చెదురు కావలసిన అల్లరి మూకలు, వారిని చూసి కనీసం లెక్క చేయకుండ మరింత రెచ్చిపోయారు.తామంటే భయము లేదా పోలీసులను ఎలా పిలుస్తవంటూ అర్జున్ మీదకు గర్జించారు. అర్జున్ ఇంటి మీద రాళ్ళు రువ్వారు.దీంతో అప్రమత్తం పోలీసులు, అల్లరి మూకలను అక్కడి నుంచి చెదర గొట్టారు.బాధితుడు అలంకార్ అర్జున్ ఫిర్యాదు మేరకు మూడవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే ఆదర్శ్ నగర్ ప్రాంతానికి చెందిన అల్లరి మూకలు దుబ్బ కు వెళ్లి అర్జున్ ఇంటి మీద ఎందుకు దాడి చేశారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారూ. ఆదర్శ్ నగర్ కు చెందిన సుధాకర్, అర్జున్ ల మధ్య గత కొద్ది రోజుల క్రితమే కల్లు బట్టిలో మాటామాటా జరిగింది. ఈ విషయం తెలుసుకున్న సుధాకర్ తనయులు ఇద్దరు తమ స్నేహితులను వెంట వేసుకొని అర్జున్ ఇంటి వద్ద హంగామా సృష్టించారు.
