HomeCRIMEప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారు..కార్పొరేటర్ మఠం పవన్

ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారు..కార్పొరేటర్ మఠం పవన్

నగరంలోని న్యాల్కల్ రోడ్ లోని వాటర్ ట్యాంక్ సమీపంలో ప్రభుత్వ స్థలాన్ని కొందరు కబ్జా చేయాలని చూస్తున్నట్లు 8వ డివిజన్ కార్పొరేటర్ మఠం పవన్ తెలిపారు. అక్రమ నిర్మాణాలపై బుధవారం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పవన్ మాట్లాడుతూ.. తమ డివిజన్లోని ప్రభుత్వ స్థలంలో గతంలో వాటర్ ప్యూరిఫై ప్లాంట్ కొరకు లీజు కు ఇవ్వడం జరిగిందన్నారు.

లీజు సమయం ఇంకా రెండు సంవత్సరాల వరకు ఉందని, కానీ ఇటీవల వాటర్ ప్లాంట్ నిర్వాహకుడు వదిలి వెళ్లాడన్నారు. దీంతో స్థానికంగా ఉండే ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ప్రతినిధి రమేష్, బిల్డర్ లక్ష్మణ్ ఆ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారన్నారు. వాటర్ ప్లాంట్ కి అడ్డంగా టెంట్ కూడా వేశారన్నారు. ఘటనను గతంలో మున్సిపల్ కమిషనర్ దృష్టికి పలుసార్లు తీసుకెళ్లానన్నారు.

అలాగే సదరు బిల్డర్లు తన డివిజన్లో పలు నిర్మాణాలు చేస్తూ ..రోడ్డుపై ర్యాంపులను నిర్మిస్తున్నారన్నారు. ప్రశ్నించినందుకు బిల్డర్ లు రమేష్, లక్ష్మణ్ లు తనపై కూడా అనవసర ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో తనపై ఓటమి చవిచూసిన వారు కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు.

కావున ఉన్నతాధికారులు ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని, కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.గతంలో కూడా అంటే మార్చి 11 రోజు కూడా కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments