నగరంలో అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు కానిస్టేబుల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ సుభాష్ గాయపడ్డారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సుభాష్ తన విధుల్లో భాగంగా తోటి సిబ్బందితో కలిసి బాస్వా గార్డెన్ వద్ద నిలుచొని ఉండగా, అటువైపుగా వచ్చిన ఒక కారు అజాగ్రత్తగా, మితిమీరిన వేగంతో వచ్చి ఆయన్ని బలంగా ఢీకొట్టింది.ప్రమాదం జరిగిన వెంటనే అక్కడే ఉన్న మూడవ పట్టణ ఎస్ఐ అప్రమత్తమయ్యారు.
గాయపడిన కానిస్టేబుల్‌ను తక్షణమే చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందేలా చూశారు. మరోవైపు ఘటన జరిగిన వెంటనే నాలుగవ టౌన్ ఎస్ఐ స్పందించి, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను నిందితుడిని) అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
