Saturday, April 18, 2026
HomeTelanganaNizamabadమేయర్ అభ్యర్థి ఫై ఎటూ తేల్చని కాంగ్రెస్ ……ఉత్తమ్ టూర్ తర్వాత కూడా రాని క్లారిటీ...

మేయర్ అభ్యర్థి ఫై ఎటూ తేల్చని కాంగ్రెస్ ……ఉత్తమ్ టూర్ తర్వాత కూడా రాని క్లారిటీ ……..తెరమీదికి రోజుకో పేరు

బీజేపీ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పాగా వేయడానికి కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతుంది.మేయర్ పీఠం దక్కించుకుంటామని బీరాలు పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి ఎవరనే విషయంలో ఎటూ తేల్చుకోలేక పోతుంది. ఇప్పటికే రెండు సార్లు జిల్లా నేతలతో భేటీ అయిన ఉత్తమ్ రెడ్డి సైతం క్లారిటీ ఇవ్వలేక పోవడంతో రోజుకో అభ్యర్థి తెరమీదికి వస్తున్నారు. మెజార్టీ కార్పొరేటర్లు గెలిచిన తర్వాతే మేయర్ ఎవరనేది తేలుతుంది.

కానీ అత్యంత కీలకమైన ఈ ఎన్నికలఆర్థిక భారం మోయడానికి బడా నేతలెవ్వరూ ఆసక్తిగా వుండరు అందుకే మేయర్ పదవి కి అభయహస్తం పొందిన వారే దివిజన్ లావారీగా ఎన్నికల వ్యయం ను మోస్తారు. అందుకే మేయర్ పోస్టు కోసం బలమైన సామజిక ఆర్థిక నేపథ్యం ఉన్న వారిని తెరమీదికి తేవడం కాంగ్రెస్ పార్టీకి అనివార్యం బీజేపీ మేయర్ అభ్యర్థి గా స్రవంతి రెడ్డి పేరు దాదాపు ఖరారు అయినట్లేనని బీజేపీ నేతలు సంకేతాలు ఇచ్చేస్తున్నారు కానీ అధికార కాంగ్రెస్ నేతలు ఇంకా తర్జన భర్జనలు చేస్తున్నారు.

అందుకే రోజుకో పేరు తెరమీదికి వస్తుంది మొదట డాక్ట కవితా రెడ్డి పేరు బలంగా ప్రచారంలోకి వచ్చింది. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నీ తానై ఆమె ను మేయర్ క్యాండెట్ గా రంగంలోకి దించబోతున్నారని విస్తృతంగా ప్రచారం అయింది. కానీజిల్లా ఇంచార్జ్ గా ఉత్తమ్ ఎంట్రీ ఇవ్వడంతో సమీకరణాలు మారిపోయాయి. ఆదిలాబాద్ ఇంచార్జ్ తో పాటు సుదర్శన్ రెడ్డి బోధన్ వ్యవహారాలకు పరిమితం చేసారు. అర్బన్ ఇంచార్జ్ గా ఉన్న షబ్బీర్ అలీ కార్పొరేషన్ బాధ్యతలు చూస్తారని ఉత్తమ్ తెగేసి చెప్పారు.

ఈ నేపథ్యంలో కార్పొరేషన్ ఎన్నికల్లో షబ్బీర్ క్రియాశీలకంగా వ్యవహరించనున్నారు.మరో వైపు బీజేపీ సానుభూతి పరుడుగా ముద్ర ఉన్న వ్యాపార వేత్త దినేష్ రెడ్డి సతీమణి పేరు మేయర్ అభ్యర్థిగా తెరమీదికి వచ్చారు. పీసీసీ చీఫ్ ఎంట్రీ ఇచ్చి ఎహే కొత్త వారికి ఇలాంటి బాధ్యతలు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దీనితో ఆయనే మేయర్ అభ్యర్థి విషయంలో తర్జన భర్జనలు చేస్తున్నారు.

విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి పేరు ఇప్పుడు తాజాగాతెరమీదికి వచ్చింది. ఈ మేరకు ఆయన ఉత్తమ్ రెడ్డి తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ షబ్బీర్ అలీ లతో మంతనాలు జరిపారు. పదవి విరమణ చేసిన తన సతీమణి ని రంగంలో కి దించడానికి ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు ఈ మేరకు 17 డివిజన్ నుంచి కార్పొరేటర్ గా బరిలోకి దింపడానికి సిద్ధం అవుతున్నారు.

నాలుగు దశాబ్దాలుగా అనేక వ్యాపారాల్లో బలమైన ముద్ర ఉన్న ఆయనకు కిందిస్థాయి లో కులసంఘాలు సామాజికసంస్థలతో మమేకం అయి పనిచేసారు. సానుకూల అంశాలు అనేకం వుండడంతో ఉత్తమ్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతుంది కానీ సీఎం విదేశాల్లో ఉండడంతో ఆయన వచ్చాకే క్లారిటీ వస్తుందని పీసీసీ చీఫ్ మహేష్ మేయర్ అభ్యర్థి వ్యవహారం పెండింగ్ లో పెట్టారు. కానీ క్షేత్ర స్థాయిలో బీజేపీ బలంగా వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా మేయర్ ఎవరనే విషయంలో ఎటూ తేల్చుకోలేక పోతుంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!