మున్సిపల్ ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసింది. శనివారం ఉదయం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ ప్రక్రియ పారదర్శకంగా సాగింది.
మహిళా రిజర్వేషన్లను లక్కీ డ్రా పద్ధతిలో ఖరారు చేశారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని మొత్తం 60 డివిజన్లతో పాటు ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్ మున్సిపాలిటీలకు సంబంధించిన డివిజన్ల వారీగా రిజర్వేషన్లను కలెక్టర్ అధికారికంగా ప్రకటించారు.
కార్పొరేషన్‌లోని 60 డివిజన్ల రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి:ఎస్సీ జనరల్ 2 వ డివిజన్… ఎస్సీ వుమెన్ కు..17,39,40,44ఎస్టీ…13బీసీ జనరల్…7,14,15,16,28,38,42,43,46,48,51,52,58,బీసీ వుమెన్..16,20,22,23,37,41,45,56,57,59,60అన్ రిజర్వ్డ్ ..జనరల్…1,4,5,8,10,18,19,25,26,30,35,47,50,55వుమెన్..3,6,9,11,21,24,27,29,31,32,33,34,36,49,53,54.
రిజర్వేషన్ల ఖరారుతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. తమ డివిజన్లు ఏ కేటగిరీకి వెళ్లాయో తెలుసుకునేందుకు ఆశావహులు, రాజకీయ నాయకులు ఐడీఓసీ కార్యాలయానికి భారీగా తరలివచ్చారు.
