HomeLaw and Orderమీనాక్షి కి సుప్రీం లో దక్కని ఊరట .......చేజారిన రాజ్యసభ స్థానం..

మీనాక్షి కి సుప్రీం లో దక్కని ఊరట …….చేజారిన రాజ్యసభ స్థానం..

ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ సుప్రీం కోర్టు లో గురువారం ఊరట దక్కలేదు దీనితో మధ్యప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల పక్రియ పూర్తీ అయింది ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఇద్దరికి బదులుగా ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా ఈసీ ప్రకటించింది. అందులో తరుణ్ చుగ్, రజనీశ్ అగర్వాల్, మహేశ్ ఉన్నారు. సంఖ్యాబలం ప్రకారం దక్కాల్సిన సీటును కాంగ్రెస్ కోల్పోయింది.

రాజ్యసభ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగానామినేషన్ వేసిన మీనాక్షి ఫై తెలంగాణ లో నమోదు అయిన కేసు విషయంఅఫిడెవిట్ లో ప్రస్తావించ లేదు. అదే సాకుగా చూపుతూ ఎన్నికల కమిషన్ ఆమె నామినేషన్ ను తిరస్కరించింది.

కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టు ను ఆశ్రయించింది. కేసు విచారణకు సుప్రీం అంగీకరించినా మధ్యంతర ఆదేశాలు ఇవ్వడానికి ససేమిరా అంది. మరో వైపు మధ్యప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల పక్రియ పూర్తీ అయింది రెండు స్థానాలను గెలవాల్సిన బీజేపీ మూడో స్థానం సైతం దక్కించుకుంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments