మహిళలు అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుంది అని భావించిన వ్యక్తి పులే ..
మహాత్మా జ్యోతి రావు పులే జయంతి సందర్భంగా గురువారం మాజీ MLC ఆకుల లలిత కాంగ్రెస్ భవన్ నందు జ్యోతి రావు పులే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వినాయక నగర్లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ జ్యోతిరావు ఫూలే గారు ఎంతో ఆదర్శమైన వ్యక్తి అని,మహిళల అభ్యున్నతి కోసం,పేద ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి అని అన్నారు.సమాజం అభివృద్ధి చెందాలంటే పురుషులతో సమానంగా మహిళకు విద్య అవసరం అని భావించిన పులే గారు ఆయన సతీమణితో కలిసి మొదటి మహిళా పాఠశాలను ప్రారంభించారని,మొదటగా ఆయన సతిమానికే విద్యనేర్పి ఆదర్శంగా నిలిచారు అన్నారు,సమాజంలో అణగారిన వర్గాల ప్రజల మీద చూటిస్తున్న వివక్ష పోవాలని,కులాల వారీగా ప్రజలను విభజించి తక్కువ. చేయడం సరికాదని పోరాడిన వ్యక్తి అని ఆమె అన్నారు.మద్యపాన నిషేదం కోసం పోరాటం చేశారని,జ్యోతి రావు పులే గారు చూపిన మార్గంలో అందరూ నడవని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్,మాజీ మేయర్ ఆకుల సుజాత, తదితరులు పాల్గొన్నారు.





