ఫూలే 198వ జయంతి (ఏప్రిల్ 11న) సందర్భంగా గురువారం నగరంలోని హనుమాన్ జంక్షన్ వద్ద విగ్రహానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పూలమాల లేసి నివాళులర్పించారు. అనంణరం ఆయన మాట్లాడుతూ.పూలే త్యాగాలను, సమాజానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సామాన్యుడిగా మొదలై.. సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన ఫూలే జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు.
సామాజిక కార్యకర్తగా, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త పూలే భావి తరాలకు సైతం మార్గదర్శకుడని ఆయన గుర్తు చేసుకున్నారు. సమాజంలో వివక్షకు తావు లేదని, సమానత్వం ఉండాలని జీవితాంతం పోరాడిన మహనీయుడని ఆయన తెలిపారు. ఇంతటి మహానీయుడైన పూలే యొక్క ఆశయాలను దృష్టిలో ఉంచుకొని మన నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కూడా ఎక్కడ వివక్షతకు తావు లేకుండ అన్ని వర్గాలకు సమానమైన హోదా ఇవ్వడం జరిగింది.
అలాగే గిరిజన జాతికి చెందిన రాష్ట్రపతిని నియమించడం చాలా గొప్ప విషయమని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షుడు దినేష్ కుల చారి మరియు ఇతర బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.





