ఈద్ ముబారక్
- మత సామరస్యానికి ప్రతీక రంజాన్
- ఘనంగా ప్రారంభమైన రంజాన్ వేడుకలు
- ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్ధనలు
- ముస్లీంలకు రంజాన్ పండగ శుభాకాంక్షాలు నాయకులు
ముస్లింలు సోదరుల రంజాన్ ఉపవాసాలు బుదవారంతో ముగిశాయి .నెలవంక కనిపించినట్టు ఇమామ్‌లు ప్రకటించడంతో రంజాన్ వేడుకలు జిల్లావ్వాప్తంగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి…ఈ నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రంజాన్ సందర్భంగా నిజామాబాద్ నగరంతో పాటు ఆర్మూర్, బోధన్ డివిజన్ లో ఆయా మండలాల్లో పలువురు మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేస్తున్నారు. కాగా పలు మసీదుల వద్ద ప్రార్ధనలకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగ నిలుస్తుండంతో… మతంతో సంబంధం లేకుండా ముస్లింలు ప్రతి ఒక్కరికీ స్వీట్స్ పంచుతూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. . మత సామరస్యాన్ని పెంపోందించే రంజాన్ మత సామరస్యాన్ని, ఆత్మీయతను, సుహృద్భావాన్ని చాటే అపురూపమైన పండుగ రంజాన్. హిందూ, ముస్లింల మధ్య ఉన్న సోదర భావాన్ని పెంపొందించే పండగ .
రంజాన్ పండుగ ప్రతి ఒక్క ముస్లిం కుటుంభంలో ఆనందాన్ని తీసుకువస్తుంది. రంజాన్ రోజు ముస్లిం సోదరులు బిర్యానీ తిని, సేమ్యా ఖీర్ తాగుతూ పండగను జరుపుకుంటారు, కాగా భిన్న మతాలకు, విభిన్న సంస్కృతులకు నిలయం తెలంగాణ లో కూడ పలువురు హిందువులు కూడ ఆయా ముస్లిం సోదరుల ఇండ్లలోకి వెళ్లి మత సామరస్యాన్ని పెంపోందించే విధంగా వారికి రంజాన్ శుభాకాంక్షాలు తెలిపారు.
ఈనేపథ్యంలోనే జిల్లాలో ఎమ్మెల్యేలు , కాంగ్రెస్ నేతలు ముస్లీంలకు రంజాన్ పండగ శుభాకాంక్షాలు తెలిపారు. అలాగే ఆర్మూర్ ఈద్గా వద్ద కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వినయ్ రెడ్డి రంజాన్ వేడుకలలో పాల్గొన్నారు.