Friday, April 24, 2026
HomeCRIMEప్రియురాలితో భర్త.. దేహశుద్ధి చేసిన భార్య..

ప్రియురాలితో భర్త.. దేహశుద్ధి చేసిన భార్య..

పరాయి మహిళతో సంబంధం పెట్టుకున్న భర్తను భార్య, ఆమె కుటుంబ సభ్యులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని దేహశుద్ధి చేసిన ఘటన నిజామాబాద్‌ నగరంలో కలకలం రేపింది.

స్థానికుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన శ్రావణ్‌ కుమార్‌ కొంతకాలంగా గిర్రాజ్‌ కళాశాల సమీపంలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.

ఈ విషయంపై అనుమానం పెంచుకున్న భార్య, తన కుటుంబ సభ్యులతో కలిసి నిఘా పెట్టింది. ఈ క్రమంలో గురువారం రాత్రి వారిద్దరూ కలిసి ఉండగా భార్య, బంధువులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఆగ్రహానికి గురైన వారు శ్రావణ్‌ కుమార్‌తో పాటు సదరు మహిళకు దేహశుద్ధి చేశారు. అనంతరం ఇద్దరినీ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!