బి ఆర్ ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశం.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీలు కూడా నెరవేర్చలేదంటూ బాజీ రెడ్డి విమర్శించారు. గురువారం నిజామాబాద్ నగరంలోని ఎంకే కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన లోక్సభ ఎన్నికల సన్నాహా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను నిండా ముంచిందని ఆయన మండిపడ్డారు.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రూ.4000ల పెన్సన్ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఏ ఒక్కరికి కూడా ఇవ్వలేదు అని ఆయన పేర్కొన్నారు.
అలాగే బిగాల గణేష్ గుప్తా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంతగానో అభివృద్ధి చేశారు అంటూ ఆయన గుర్తు చేశారు. బిజెపి ఎంపీ అభ్యర్థి అరవింద్ 5 సంవత్సరాల సమయంలో నిజామాబాద్ కి ఏం చేశారు అని ఆయన ప్రశ్నించారు.
ఈ పార్లమెంట్ ఎన్నకల్లో కాంగ్రెస్, బిజెపి పార్టీలను ఓడించి వారికి గుణపాఠం చెప్పాలని ఆయన ప్రజలను పేర్కొన్నారు. నన్ను ఎంపీగా ఆశీర్వదించండి జిల్లాకు కావలసిన నిధులను ప్రభుత్వాన్ని ముక్కు పిండి వసూలు చేస్తానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ అర్బన్ ఎమ్మెల్యే దిగాల గణేష్ గుప్తా, నగర మేయర్ నీతూ కిరణ్, విజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

