లంచం అడిగిన ఘటనలో ట్రన్స్ కో అధికారికి ఏడాది జైలు శిక్ష విధిస్తు నాంపల్లి ఏసీబీ కోర్టు తీర్పు చెప్పింది.
2008 జులై లో మాక్లూర్ మండలం మదన పల్లి తన వ్యవసాయ క్షేత్రంలో విద్యుత్ కనెక్షన్ కోసం సుభాష్ గార్డెన్ యజమాని కేసరి శ్రీనివాస్ రెడ్డి ఏ ఏ ఈ మచ్చ సదాశివ ని సంప్రదించారు.
కానీ సదురు అధికారి రూ 5 వేల లంచం డిమాండ్ చేయడంతో శ్రీనివాస్ రెడ్డి ఏసీబీ అధికారులను కలిసి పిర్యాదు చేసాడు. దీనితో ఆయననుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు 24 నాడు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు.
నాంపల్లి ఏసీబీ కోర్టు లో విచారణ జరిగింది. స్పెషల్ పీపీ లక్ష్మి మనోజ్ఞ ఏసీబీ పక్షాన వాదనలు వినిపించారు.
నిందితుడి మీద అభియోగాలు రుజువు కావడంతో ఏఏ ఈసదా శివ కు ఏడాది జైలు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తు న్యాయ మూర్తి మహ్మద్ అఫ్రోజ్ అక్తర్ మంగళవారం తీర్పు చెప్పారు.
జరిమానా చెలించని పక్షంలో మరో మూడు మాసాలు జైలు శిక్ష అనుభవించాలని ఆయన పేరుకొన్నారు .