రెండు లక్షల రూపాయలకు సోలాపూర్ వ్యక్తికి విక్రయంఅధిక సంతానం, ఆపై పేదరికం.. చేసేదేమీ లేక ఆ తల్లి ఐదో సంతానమైన ఆడబిడ్డను విక్రయించింది.ఈ ఘటన నగరంలోని ఒకటవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది.
తమకు పుట్టిన పసిబిడ్డను మధ్యవర్తుల సాయంతో మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవారికి విక్రయించారు. ఈ మేరకు చైల్డ్ వెల్ఫేర్ అధికారిని ఫిర్యాదు చేయడంతో ఈ విషయంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఒకటో టౌన్ సీఐ రఘుపతి వెల్లడించిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ నగరంలోని మిర్చి కాంపౌండ్ ప్రాంతానికి చెందిన ముత్యాలమ్మ, వెంకట్రావు లకు అప్పటికే నలుగురు ఆడబిడ్డలు ఉన్నారు.
జూన్ 30న ఐదో సంతానంలో సైతం ఆడబిడ్డ పుట్టింది. దీంతో ఆడబిడ్డలను పోషించడం తమకు భారమవుతుందని ఆ తల్లిదండ్రులు అదే ప్రాంతానికి చెందిన ఉమారాణి అనే మహిళ తమకు పరిచయస్తులు అయిన నాగమణి అనే మహిళతో కలిసి మహారాష్ట్రలోని సోలాపూర్ కు చెందిన వ్యక్తి కి వారి ఐదో సంతానమైన పసిబిడ్డను ఈనెల 6న రూ.2 లక్షల కు విక్రయించారు.
పసిపాపను విక్రయించిన విషయం తెలియడంతో సీడీపీవో సౌందర్య శుక్రవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు నిర్వహిస్తున్నట్లుగా సీఐ రఘుపతి వెల్లడించారు.
