కొత్త కమిషనర్ కొలువు దీరిన పోలీసులవైఖరి మారడం లేదు. చేతికి చిక్కిన పిడియస్ బియ్యంను వదిలేసారు. అక్కడిక్కడే నిందితుడి తో రూ 15 వేల కు డీల్ కుదుర్చుకొని జేబులో ఉన్న నగదు సర్దు బాటు కాక పోవడంతో చివరికి ఫోన్ పే తో ద్వార మిగితా మొత్తం వసూలు చేసుకొని బియ్యం వాహనం ను వదిలేసారు.
గత కొంత కాలంగా రోజు నిజామాబాద్ నుంచి బోధన్ నవీపేట్ లమీదుగా పిడియస్ బియ్యం అక్రమ రవాణా దందా సాగుతుంది.
నగరానికి చెందిన ఓ యువకుడు మిర్చి కాంపౌండ్ నుంచి 15 క్వింటాళ్ల బియ్యం ను బోధన్ మీదుగా మహారాష్ట్ర కు తరలించడానికి గత రెండు రోజుల క్రితం మినీ డీసీఎం రాత్రి బయలు దేరాడు.ప్రధాన రోడ్ల మీదుగా వెళ్తే పోలీసులకు చిక్కుతాననే భయంతో గుండారం మీదుగా వెళ్ళాడు.
రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో గుండారం నవీపేట్ మధ్య రైల్వే గేట్ సమీపంలో గుట్ట వైపు నుంచి గ్లామర్ బైకు మీద వచ్చిన ఇద్దరు ఈ వాహనం ను ఆపేసారు.వాహనంలో ఏ సరుకు వుందని వాకబు చేశారు.
మీరెవరు అంటూ డ్రైవర్ గద్దించి అడగడంతో తాము గస్తీ పోలీసులమని చెప్పడంతో డ్రైవర్ కు వణుకు పుట్టింది. పిడియస్ బియ్యం ఉన్నాయని చెప్పాడు.బండి స్టేషన్ కు తీసుకెళ్లాలన్నారు.
కానీ బండి స్టేషన్ కు వెళ్తే కేసు బెయిల్ లక్ష రూపాయల ఖర్చు అవుతుందని భయపడ్డ డ్రైవర్ గస్తీ పోలీసులతో బేరం మొదలు పెట్టాడు. 20 వేలు ఇస్తే బండి వదిలేస్తామని గస్తీ పోలీసులు చెప్పారు.
అంత డబ్బు తన వద్ద లేదని వదిలేయాలని బ్రతిమాలుకున్నాడు. కావాలంటే తన జేబులో ఉన్న 4300 వేలు ఇస్తానన్నాడు. ఎహే కనీసం 15 వేలు ఇస్తే చూద్దామన్నారు.
చివరికి 10 వేలకు బేరం కుదిరింది.మిగితా డబ్బు ఎలా సర్దు బాటు చెయ్యాలో తెలియక డ్రైవర్ ఇబ్బంది పడ్డాడు. నిజామాబాద్ నగరంలో తన స్నేహితుడి ని సంప్రదించి ఫోన్ పే ద్వార నేరుగా గస్తీ పోలీసు ల ఫోన్ కు బదిలీ చేయించారు.
కుదిరిన బేరం మేరకు పది వేలు వసూలు చేసుకున్నాకే బియ్యం వాహనం ను వదిలేసారు.
Impact
బాద్యుల మీద చర్యలు ….ఎస్సై
బియ్యం వాహనం వదిలేసిన వ్యవహారం తన దృష్టికి రాలేదని విచారణ జరిపి తదుపరి చర్యల కోసం ఉన్నతాధికారులకు నివేదిస్తాం.
