గంజాయి విక్రయిస్తున్న వ్యక్తులను పట్టుకున్నట్లు ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పేర్కొన్నారు.సీఐ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం.
విశ్వసనీయ సమాచారం మేరకు నాందేడ్ నుంచి నిజామాబాద్,నవిపేట్ రైల్వే స్టేషన్ పరిధి లో విక్రయిస్తున్న 450గ్రాముల ఎండు గంజాయి,రెండు సెల్ ఫోన్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ వెంకటేష్ ఆధ్వర్యంలో దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు.
వారి లో ఒకరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే నవిపేట్ లో కూడా 250గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకుని ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఎక్సైజ్ ఎస్ఐ నరసింహాచారి సిబ్బంది పాల్గొన్నారు.
