వినాయక చవితి ఉత్సవాలు సామరస్యం, సమన్వయంతో శాంతియుతంగా జరుపుకోవాలని భీమ్ గల్ సీఐ నవీన్ మండలం లోని గ్రామాల ప్రజలకు సూచించారు.మంగళవారం ఏర్పాటు చేసిన శాంతియుత కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
భీంగల్ లో జరిగే గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించి ప్రజలకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా చూడాలని కోరారు.
అదే విధంగా వినాయకుని తీసుకువచ్చే సమయంలో ఎవరు డీజీలు పెట్టరాదు.అట్టి వెహికల్స్ లో చిన్న పిల్లలను ఉండకుండా చూసుకోవాలి.6 ఫీట్ల కంటే ఎత్తు గల వినాయకుల ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి.
వినాయకులు తెచ్చే క్రమంలో కరెంట్ వైర్లు తాగకుండా చూసుకోవాలి. వినాయకులను దించే క్రమంలో జాగ్రత్త వహించాలి.పూజా కార్యక్రమంలో ఆడవాళ్ళతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి.
వినాయక మండపంలో తొమ్మిది రోజులు రెండు బాక్సులు మాత్రమే పెట్టుకోవాలనీ తెలిపారు. అదే విధంగా నిమర్జనం చేసేటప్పుడు ఎవరు మద్యం సేవించకుండా భక్తితో నిమజ్జనం చేయాలనీ హెచ్చరించారు.
వినాయక నిమజ్యానికి పెట్టుకున్న ట్రాక్టర్ మరియు లారీ డ్రైవర్లు ఎప్పుడు బండి వెంటనే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో బండిని విడిచి ఎక్కడికి వెళ్ళరాదనీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భీమ్ గల్ ఎస్ఐ మహేష్,మండలానికి చెందిన యూత్ సభ్యులు,మత పెద్దలు పాల్గొన్నారు.
