రెంజల్ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమం వద్ద మౌని అమావాస్య అని పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులు పుణ్య స్థానాలు ఆచరించారు. బుధవారం ఉదయం నుండే పుష్కర ఘాట్ల వద్ద భక్తులు పుణ్యస్నానాలు చేసి గంగమ్మకు హారతి ఇచ్చారు.
సాంప్రదాయ పద్ధతిలో మహాశివరాత్రి ముందు అమావాస్య అయినటువంటి మౌని అమావాస్యని పురస్కరించుకొని పుణ్య స్థానాలు ఆచరించి ప్రత్యేకమైన పూజలు చేయడం సనాత ధర్మంలో సాంప్రదాయం.
పుణ్య స్థానాల అనంతరం శివునికి ప్రత్యేక పూజలు చేశారు. గోదావరిలో ఉన్నటువంటి శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు గోదావరిలో కొద్దిగా నీళ్లు తగుముకడం పట్టడంతో శివాలయం చుట్టూ నీటిలో ప్రదర్శనలు చేశారు.
