HomeCRIMEనకిలీ డాక్టర్ వైద్యానికి యువతి మృతి..

నకిలీ డాక్టర్ వైద్యానికి యువతి మృతి..

డాక్టర్ గుట్టు రట్టు చేసిన పోలీసులు..వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం చివరకు ప్రేమగా మారింది. కుటుంబ సభ్యులకు తెలీకుండా ప్రేమాయణం సాగించారు. అయితే ఈ క్రమంలో ఇటీవల యువతి గర్భం దాల్చింది.బయట తెలిస్తే పరువు పోతుందనే ఉద్దేశంతో ప్రియుడు ఆమెకు అబార్షన్ చేయించాలని నిర్ణయించుకున్నాడు.

అయితే అబార్షన్ పేరుతో ప్రియుడు గ్రామంలోని ఎలాంటి లైసెన్స్ లేని నకిలీ వైద్యుడిని సంప్రదించాడు. నకిలీ డాక్టర్ చేసిన వైద్యానికి చివరకు యువతి మృతి చెందింది.ఎటువంటి లైసెన్స్ లేకుండా వైద్య వృతిని నిర్వహిస్తున్న పీఎంపీ డాక్టర్ ను పట్టుకొని అరెస్ట్ చేసినట్లు ఏసిపి రాజా వెంకటరెడ్డి పేర్కొన్నారు.

ఈ ఘటన మాక్లూర్ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే మాక్లూర్ మండలంలోని కల్లెడ గ్రామానికి చెందిన ఆయేషా, మెండోరా మండలం సావెల్ గ్రామానికి చెందిన వివేక్ అనే యువకునితో పరిచయం ఏర్పడింది. పరిచయం చివరకు ప్రేమగా మారింది.

ఆయేషా,వివేక్ తో సన్నిహిత్యం కారణంగా ఆమె గర్భం (2 నుండి 3 నెలల) దాల్చింది. విషయం యువతీ వివేక్ తో చర్చించి అతని సలహా మేరకు గర్భం తొలగించు కోవాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు ఈ నెల 04 వ తేదీన వివేక్ తన గ్రామానికి చెందిన పీఎంపీ డాక్టర్ హరీ కృష్ణ చారి ని సంప్రదించి ఇట్టి విషయం చెప్పగా అతను ఫోన్ ద్వార సలహాల్లు ఇచి గర్భస్రావనికి UNWANTED-KIT (Rx Kit of Mifepristone & Misoprostol Tablests) మాత్రలు ఇవ్వగ అట్టి మాత్రలను వివేక్ యువతికి ఇచ్చినాడు.

3 రోజుల తర్వాత 7 వ తేదీన రాత్రి ఆమె కడుపు నొప్పి, బ్లీడింగ్ రాగా గర్భ స్రావం జరిగినది. తర్వాత అదే రోజు రాత్రి అట్టి యువతిని ఆమె తల్లికి సమాచారం అందించడంతో హుటాహుటిన నిజామాబాదు లోని ప్రైవేట్ అస్పత్రి కీ తీసుకొని వెళ్ళినది.

అక్కడ డాక్టర్స్ అమెకు గర్భ స్రావం జరిగినది అని, కిడ్నీ, లివర్ ఇన్ఫెక్షన్ వచ్చినది అని చెప్పగా మెరుగైన చికిత్స కోసం 10 వ తేదీన హైదరాబాద్ తీసుకొని వెళ్తుండగా మార్గ మధ్యలో యువతి మృతి చెందినట్లు తెలిపారు.

తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మాక్లూర్ ఎస్ఐ రాజశేఖర్,సిబ్బంది విచారణ చేపట్టి యువతి మృతికి కారకులైన యువకుడు వివేక్ , పీఎంపీ డాక్టర్ హరి కృష్ణ చారి అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments