జిల్లా సహకార బ్యాంకు లో అవిశ్వాస రగడ కీలక మలుపు తిరిగింది. గురువారం జరిగే అవిశ్వాస పక్రియ కు న్యాయ పరమైన అడ్డంకులు తొలిగాయి. దాదాపు పదిహేను రోజుల హైడ్రామా కు రేపటి తో తెరపడబోతుంది. తనపై అవిశ్వాసం వోటింగ్ ను సవాల్ చేస్తూ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి వేసిన రిట్ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈనెల 5న నిజామాబాద్ డీసీసీబీకి చెందిన 15 మంది డైరెక్టర్లు పోచారం భాస్కర్ రెడ్డి పై అవిశ్వాస తీర్మానం నోటీసును డీసీఓ కు అందజేశారు.
నిజానికి జిల్లా సహకార బ్యాంకు పాలక మండలి లో డైరెక్టర్ లు అందరూ బిఆర్ యస్ కు చెందిన వారే . అయినప్పటికీ డైరెక్టర్ల మూకుమ్మడిగా తిరుగుబాటు జెండా ఎత్తారు. అదికూడా బిఆర్ యస్ దిగ్గజ నేత ప్రశాంత్ రెడ్డి వీర విధేయుడు వైస్ ఛైర్మెన్ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలోనే అవిశ్వాసం పక్రియ జరిగింది.ఈ పరిణామాలతో రగిలిపోయిన పోచారం శ్రీనివాస్ రెడ్డి రంగంలోకి దిగారు. అసలు అవిశ్వాస పక్రియ నిర్వహించకుండా అధికారుల మీద ఒత్తిడి చేసారు.కానీ ఈనెల 21న అవిశ్వాసంపై ఓటింగ్ కు ముహూర్తం ఖరారు చేసారు దాంతో పోచారం భాస్కర్ రెడ్డి పదవికి గండం ఏర్పడింది.
ఎంపీ టికెట్ కోసం ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ వ్యవహారం ను లైట్ తీసుకున్న భాస్కర్ రెడ్డి టికెట్ దక్కక పోవడంతో ఉన్నపదవి ఊడిపోకుండా పావులు కదిపారు. డీసీఓ ఇచ్చిన అవిశ్వాస నోటీస్ చెల్లదని పోచారం భాస్కర్ రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు.,గురువారం అవిశ్వాస పరీక్ష ఉండడంతో కోర్టు ఆదేశాల ఉత్కంఠ ను రేపాయి.బుధవారం పోచారం భాస్కర్ రెడ్డి వేసిన పిటిషన్ డిస్మిస్ చేసింది. దీనితో గురువారం నాటి అవిశ్వాస పక్రియ కు మార్గం సుగమం అయింది. రమేష్ రెడ్డి డీసీసీబీ చైర్మన్ పదవి లక్ష్యంగా డైరెక్టర్ల ను గోవా క్యాంపు కు తీసుకెళ్లాడు.
అయితే అంతుకు ముందే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ని కలిసి సహకారం కోరారు. రమేష్ రెడ్డి ఎలాగో సమీప బంధువు కావడంతో ఆయన కూడా కాదనలేక పోయారు. పోచారం భాస్కర్ రెడ్డి ముందుగానే తన పదవికి రాజీనామా చేస్తారని మొదటి ప్రచారం జరుగుతుంది . నిజామాబాద్ డీసీసీబీ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమైంది. డీసీసీబీ వైస్ చైర్మన్ కుంట రమేష్ రెడ్డికి చైర్మన్ పదవి కట్టబెట్టాడనికి మాజీ మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు నాలుగేండ్ల కింద పోచారం భాస్కర్‌రెడ్డి డీసీసీబీ చైర్మన్ గా నియామకం అయ్యారు . 20 మంది డైరెక్టర్లలో 14 మంది రమేష్ రెడ్డి శిబిరం లో ఉన్నారు భాస్కర్రెడ్డివైపు ఆరుగురు డైరెక్టర్లు ఉన్నారు. 11 మంది డైరెక్టర్లతో అవిశ్వాస మీటింగ్నిర్వహించవచ్చు, అయితే అవిశ్వాసాన్ని నెగ్గాలంటే 14 మంది డైరెక్టర్ల మద్దతు సరిపోతుంది.
