లోక్ సభ ఎన్నికల ప్రణాళిక వెలువడిన నేపద్యంలో నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని తుపాకీ లైసెన్స్ పొందిన వారు తమ వద్ద ఉన్న ఆయుధాలను వెంటనే తమకు అప్పగించాలని పోలీసు కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశించారు.
సెక్షన్ 21 ఆఫ్ Arms యాక్టు 1959 ప్రకారం నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని Arms లైసెన్స్ పొంది ఉన్నవారు వారి యొక్క లైసెన్స్ ఆయుధాలను సంబంధిత పోలీస్ స్టేషన్ లలో ఈనెల 23- లోపు జమ చేయలని ఆయన ఉత్తర్వ్యూలు జారీచేసారు ఎవరయిన లైసెన్స్ ఆయుధాలు జమ చేయనట్లయితే వారిపై Arms యాక్టు ప్రకారంగా చట్టరీత్య చర్యలుంటాయని ఆయన స్పష్టం చేశారు
ఉత్తర్వుల నుండి మినహాయింపు పొందగోరువారు జిల్లా Arms స్క్రీనింగ్ కమిటి, నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవలన్నారు ఇతర వివరముల కోసం సి.సి.ఎస్ సీఐ ప్రేమ్ కుమార్ ను (87125-96820) సంప్రదించాలన్నారు
