రైల్వే బోగి లో నుంచి మంటలు వచ్చిన ఘటన నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో గురువారం చోటు చేసుకుంది.అగ్ని మాపకం శకటం వచ్చి మంటలు ఆర్పింది. పెద్దపల్లి నుంచి ముంబయి కి బొగ్గు లోడు తో వెళ్తున్న గూడ్స్ రైల్ బోగి నుంచి పెద్దఎత్తునపొగ వస్తున్నట్లు స్టేషన్ సిబ్బంది గమనించారు. కానీ ఆ రైలు అప్పటికే స్టేషన్ ధాటి వెళ్ళిపోయింది. వెంటనే అప్రమత్తం అయిన అధికారులు డ్రైవర్ ను సమాచారం ఇచ్చారు.
రైల్ ను వెనక్కి రప్పించారు. ఈలోపు అగ్నిమాపక వాహనం వచ్చింది. వెంటనే దట్టమైన పొగలు వస్తున్నబొగ్గు లోడు బోగి ని గుర్తించారు. బోగి కింది భాగంలో మంటలను ఆర్పేశారు. ఎండ కాలంలో బొగ్గు లోడు లో రాపిడి తో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరుగుతాయని రైల్వే అధికారులు చెప్పారు.
