దీనితో భాస్కర్ రెడ్డి పదవీ కోల్పోయారు. ఇంచార్జ్ ఛైర్మెన్ గా రమేష్ రెడ్డి నియామకం అయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు డీసీసీబీ ఆఫీస్ కు వచ్చి రమేష్ రెడ్డి ని అభినందించారు. డీసీసీబీ లో 20 మంది డైరెక్టర్ల వుండగా అవిశ్వాస ఓటింగ్ కు 17 మంది హాజరు అయ్యారు. గురువారం ఉదయం జిల్లా సహకార అధికారి శ్రీనివాస్ అద్వర్యం లో ఉదయం 11 గంటలకు అవిశ్వాస సమావేశం నిర్వహించారు. వైఎస్ ఛైర్మెన్ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో డైరెక్టర్ల ప్రత్యేక బస్సుల్లో వచ్చారు. అవిశ్వాస పరీక్ష కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో .
పోచారం భాస్కర్ రెడ్డి బుధవారం రాత్రే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సోషియల్ మీడియా వేదిక గా ప్రకటించారు. దీనితో గురువారం అవిశ్వాస సమావేశం నిర్వహిస్తారా లేదా ? అనే చర్చ మొదలయ్యింది. కానీ ఆయన రాజీనామా లేఖ తమకు అధికారికంగా అందక పోవడంతో గురువారం అవిశ్వాస .
ఫక్రి ను యధావిధిగా నిర్వహిస్తామని అధికారులు స్పష్టం చేసారు. దాదాపు పదిహేను రోజుల హైడ్రామా తో తెరపడింది.. ఈనెల 5న నిజామాబాద్ డీసీసీబీకి చెందిన 15 మంది డైరెక్టర్లు పోచారం భాస్కర్ రెడ్డి పై అవిశ్వాస తీర్మానం నోటీసును డీసీఓ కు అందజేశారు. జిల్లా సహకార బ్యాంకు పాలక మండలి లో డైరెక్టర్ లు అందరూ బిఆర్ యస్ కు చెందిన వారే . అయినప్పటికీ డైరెక్టర్ల మూకుమ్మడిగా తిరుగుబాటు జెండా ఎత్తారు.
అదికూడా బిఆర్ యస్ దిగ్గజ నేత ప్రశాంత్ రెడ్డి సన్నిహితుడు వైస్ ఛైర్మెన్ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఈ తతంగం జరగడంతో రగిలిపోయిన పోచారం శ్రీనివాస్ రెడ్డి రంగంలోకి దిగారు. దిద్దుబాటు చర్యలుచేపట్టారు. అసలు అవిశ్వాస పక్రియ నిర్వహించకుండా అధికారుల మీద ఒత్తిడి చేసారు. ఇవేవి ఫలించలేదు. ఈనెల 21న అవిశ్వాసంపై ఓటింగ్ కు ముహూర్తం ఖరారు చేసారు.
అవిశ్వాస ప్రతిపాదించిన డైరెక్టర్లు అదే రోజు అజ్ఞాతంలోకి వెళ్లారు. కానీ రమేష్ రెడ్డి మాత్రం మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి తో సంప్రదింపులు జరుపుతూ వచ్చారు. మూకుమ్ముడిగా కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధం అయ్యారు.దీనితో ఆయన చొరవ తీసుకున్నారు.పోచారం భాస్కర్ రెడ్డి పదవికి గండం ఏర్పడింది.. డీసీఓ ఇచ్చిన అవిశ్వాస నోటీస్ చెల్లదని పోచారం భాస్కర్ రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు.,గురువారం అవిశ్వాస పరీక్ష ఉండడంతో కోర్టు ఆదేశాల ఉత్కంఠ ను రేపాయి.బుధవారం పోచారం భాస్కర్ రెడ్డి వేసిన పిటిషన్ డిస్మిస్ చేసింది.
దీనితో గురువారం నాటి అవిశ్వాస పక్రియ కు మార్గం సుగమం అయింది. రమేష్ రెడ్డి డీసీసీబీ చైర్మన్ పదవి లక్ష్యంగా డైరెక్టర్ల ను గోవా క్యాంపు కు తీసుకెళ్లాడు. . 20 మంది డైరెక్టర్లలో మొదట 14 మంది రమేష్ రెడ్డి శిబిరం లో కి వెళ్లినా ఆతర్వాత మరో ముగ్గురు కలిశారు . 11 మంది డైరెక్టర్లతో అవిశ్వాస మీటింగ్నిర్వహించవచ్చు, అయితే అవిశ్వాసాన్ని నెగ్గాలంటే 14 మంది డైరెక్టర్ల మద్దతు సరిపోతుంది.కానీ గురువారం17 మంది డైరెక్టర్ల అవిశ్వాస ఓటింగ్ కు వచ్చారు.