వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ దుబాయి కే పరిమితం అయ్యారు. హైదారాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాద కేసును తిరగదోడుతున్నారు. అప్పటి దర్యాప్తు అధికారులను ఈపాటికే విచారించారు. ఆయనే కాదు కొడుకు రాహిల్‌పై మరో రోడ్డు ప్రమాద కేసులో ఉచ్చు బిగుస్తోంది.
పంజాగుట్ట ఠాణా పరిధిలోని అప్పటి సీఏం క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ సమీపంలో రోడ్డుప్రమాదం కేసులో పరారీలో ఉన్న అతడిపై ఇప్పటికే లుకవుట్ సర్క్యులర్ జారీ అయ్యాయి .ఈ కేసులో ఇద్దరు సీఐ లమీద ఏకంగా క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
ఈ కేసులో వాస్తవాలు వెలుగుచూసే లోపే రాహుల్ దుబాయి చెక్కేసాడు. దీనిపై న్యాయ పోరాటం సాగుతుండగానే మరో రోడ్డుప్రమాద ఘటనను తెరమీదికి తెచ్చారు ..జూబ్లీహిల్స్‌లో 2022న మార్చి 17న జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 నెలల చిన్నారి మృతి చెందాడు. ఈ కేసులో దర్యాప్తును పోలీసులు తిరిగి ప్రారంభించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ రోజు దుర్గం చెరువు నుంచి జూబ్లీహిల్స్ వైపు వచ్చిన మహింద్రా థార్ వాహనం రాత్రి 8 గంటలకు రోడ్డు దాటుతున్న యాచకులను ఢీకొట్టింది. ముగ్గురు మహిళలకు గాయాలు కాగా రెండు నెలల బాలుడు దుర్మరణం చెందాడు. కారులోని యువకులు పారిపోయినప్పటికీ వాహనంపై ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండటంతో షకీల్ వాహనంగా తేలింది.
అయితే అందులో తన కుమారుడు లేడని షకీల్ ప్రకటన ఇచ్చారు. మరోవైపు అఫ్రాన్ అనే మరో యువకుడు తానే కారు నడిపినట్లు అంగీకరించి లొంగిపోయాడు. స్టీరింగ్‌పై వేలిముద్రలు అఫ్రాన్‌వేనని అప్పట్లో పోలీసులు ప్రకటించారు. బాధితుల వాంగ్మూలాల సేకరణ సహా, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా మాజ్ అనే మరో యువకుడితో పాటు కారులో రాహిల్ ఉన్నట్లు తేలడంతో దర్యాప్తు మలుపు తిరిగింది. ఇటీవలే సీఎం క్యాంపు కార్యాలయం వద్ద రాహిల్ చేసిన రోడ్డు ప్రమాదం నేపథ్యంలో పాత కేసుపై డీసీపీ విజయ్ కుమార్ దృష్టి సారించారు.
అప్పట్లో 304-B సెక్షన్ చేర్చకపోవడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ గురించి ఆరా తీయకపోవడం లాంటి కారణాలను విశ్లేషిస్తున్నారు. మహారాష్ట్రకు వెళ్లి బాధితురాళ్లను నగరానికి తీసుకొచ్చి వారితోపాటు మరికొందరి వాంగ్మూలాలు సేకరించారు. ఘటన జరిగిన రోజు డ్రైవింగ్‌సీట్ నుంచి లావుగా ఉన్న యువకుడు పారిపోయాడంటూ బాధితురాళ్లు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం.దీన్నిబట్టి రాహిల్ డ్రైవింగ్ సీట్లో ఉన్నట్లు పోలీసులు నమ్ముతున్నారు. అతన్ని తప్పించే ప్రయత్నంలో ఒకరిద్దరు ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఎందుకంటే కొద్దీ రోజుల దాక ఈ కేసు కు సంబంధించి కీలక ఫైల్ సైతం మాయం అయింది.ఈ కేసులో ఓ ఏసీపీ ప్రమేయం ఫై ప్రాథమిక నిర్దారణ కు వచ్చారని సమాచారం.షకీల్ తనయుడు ను ఈ కేసు నుంచి తప్పించడంలో చక్రం తిప్పిన అధికారుల ను గుర్తించే పనిలో దర్యాప్తు అధికారులున్నారు
