లోకసభ ఎన్నికల్లో గెలుపు గుర్రాలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకోసం ఎడతెగని కసరత్తులు చేస్తుంది. ఇందులో భాగంగానే తటస్థులను తెరమీదికి తెచ్చింది. పీసీసీ డీసీసీ లు మూకుమ్మడిగా సిఫారస్ చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విషయంలో అధిష్టానం ఆసక్తి చూపడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన నేతకు లోకసభ టికెట్ ఇవ్వడానికి ఢిల్లీ పెద్దలు ససేమిరా అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే రెండో జాబితాలో నిజామాబాద్ లోకసభ స్థానం ను పెండింగ్ లో పెట్టేసారు. ఆర్థిక సామజిక సమీకరణలే ప్రాతిపదికగా తటస్థుల పేర్లు తెరమీదికి వచ్చాయి.ఇందుకోసం ఓ ప్లాష్ సర్వే ను చేప్పట్టారని సమాచారం.ఇందులో భాగంగానే నగరంలో పేరుప్రఖ్యాతలు గాంచిన మహిళా డాక్టర్ తో పాటు ప్రముఖ సినీనిర్మాత సోదరుడు పేర్లు తుదిపరిశీలనలోకి వచ్చాయని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇద్దరూ రెడ్డి సామజిక వర్గమే అందులోనూ ఆర్థికంగా బలంగా ఉన్నవారే.నగరంలో ముప్పై యేళ్లుగా గైనకాలజి డాక్టర్ పనిచేస్తున్న డాక్టర్ కవిత పేరును మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి తెరమీదికి తెచ్చారని సమాచారం.మహబూబనగర్ జిల్లాకు చెందిన ఆమె తో పాటు భర్త రవీందర్ రెడ్డి కూడాడాక్టరే .
కవిత రెడ్డి సామజిక సేవలో క్రియాశీలకంగా ఉన్నారు.నిజానికి ఆమె గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో నే కాంగ్రెస్ టికెట్ ఆశించారు. కానీ చివరి లో మిస్ అయింది. రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు చెందిన ఆమె ఆయన సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి కి సైతం టచ్ లో వెళ్లారు. అయితే మహిళా అందులోనూ డాక్టర్ వృత్తిలో వుండడం ఆమె కలసి వచ్చే అంశమే.
మరో వైపు సినినిర్మాత దిల్ రాజు సొంత అన్న నర్సింహా రెడ్డి పేరు సైతం ఢిల్లీ పెద్దలు పరిశీలనకు వచ్చింది. మొదట పోటీ చేయాలని దిల్ రాజునే కోరినప్పటికీ ఆయన సున్నితంగా తిరస్కరించారు. కానీ అన్న కు టికెట్ ఇవ్వలని గట్టిగా అడిగినట్లు సమాచారం. ఆయన మా పల్లె చారిటబుల్ ట్రస్టు తో సామజిక ఆధ్యాత్మ క సేవలో ఉన్నారు. ఇద్దరూ ఆర్థికంగా బలంగా ఉన్న వారే. జీవన్ రెడ్డి ఆర్థిక భారం మోయలేనని తేల్చి చెప్పడంతో నే ఆయన ను టికెట్ రేసులో నుంచి తప్పించారని ప్రచారం జరుగుతుంది.