Monday, April 20, 2026
HomeCRIMEప్రజలకు చేరువగా పోలీస్ సేవలు

ప్రజలకు చేరువగా పోలీస్ సేవలు

  • మోపాల్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీపీ సాయిచైతన్య
  • రికార్డులు, వాహనాల పనితీరుపై ఆరా నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శుక్రవారం మోపాల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
  • స్టేషన్‌లోని రికార్డుల నిర్వహణ, పెండింగ్ ఫిర్యాదుల పరిష్కారం, భద్రతా చర్యలను ఆయన క్షుణ్ణంగా సమీక్షించారు. ఈ సందర్భంగా సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్న సీపీ.. ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటూ వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
  • శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడకుండా ప్రజల విశ్వాసాన్ని పెంపొందించేలా విధులు నిర్వహించాలని సూచించారు. స్టేషన్‌కు కేటాయించిన బొలెరో మరియు పెట్రోలింగ్ వాహనాల కండిషన్‌ను కమిషనర్ స్వయంగా పరిశీలించారు.
  • పెట్రోలింగ్ వాహనాల్లో ఉండే అత్యవసర ప్రథమ చికిత్స (ఫస్ట్ ఎయిడ్) కిట్ సామాగ్రిని తనిఖీ చేశారు. అత్యవసర సమయాల్లో వాహనాలు మొరాయించకుండా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలని, వాహన నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దని సిబ్బందిని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ సౌత్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఎన్.సురేష్ కుమార్, ఎస్సై జెడ్.సుస్మిత మరియు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!