తెలంగాణ శాసనసభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇవాళ ప్రవేశపెట్టారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనుమతితో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన, తమ ప్రభుత్వ లక్ష్యాలను మరియు ప్రాధాన్యతలను సభకు వివరించారు.
తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..
రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ.3,24,234 కోట్లుని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అందులో రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లని, మూలధన వ్యయం రూ.47,267 కోట్లని తెలిపారు.
ఇక రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931 కోట్లుగా ఉందని, వృద్ధి రేటు 10.20 శాతంగా ఉందన్నారు. జాతీయ వృద్ధి రేటు కంటే తెలంగాణ వృద్ధి రేటు 2.7శాతం ఎక్కువగా ఉందన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం 1.9 రెట్లు పెరిగిందని తెలపారు.
2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా పెట్టుకున్నామని, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ టార్గెట్ అని మల్లు భట్టి విక్రమార్క అన్నారు.పశు సంవర్థక శాఖకు రూ.1,529 కోట్లు
విద్యుత్ శాఖకు రూ.21,285 కోట్లు
విద్యా శాఖకు రూ.26,674 కోట్లు
వైద్య, ఆరోగ్య శాఖకు రూ.13,679 కోట్లు
కార్మిక శాఖకు రూ.998 కోట్లు
మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ.3,143 కోట్ల
ఎస్సీ సంక్షేమానికి రూ.11,784 కోట్లు
ఎస్టీ సంక్షేమానికి రూ.7,937 కోట్లు
బీసీ సంక్షేమానికి రూ.3,769 కోట్లు
రాజీవ్ యువ వికాసానికి రూ.6 వేల కోట్లు
గృహ నిర్మాణ శాఖకు రూ.7,430 కోట్లు
ఐటీ శాఖకు రూ.875 కోట్లు
పరిశ్రమల శాఖకు రూ.3,490 కోట్లు
చేనేత రంగానికి రూ.258 కోట్లు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.33, 688 కోట్లు
నీటిపారుదల శాఖకు రూ.22, 615 కోట్లు
ఆర్ అండ్ బీ శాఖకు రూ.12,789 కోట్లు
న్యాయ శాఖకు రూ.2,367 కోట్లు
H -Citi పథకం కింద రూ.2,654 కోట్లు
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ.17,907 కోట్లు
హోం శాఖకు రూ.11,907 కోట్లు
గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం రూ.500 కోట్లు
పర్యాటక శాఖకు రూ.1,224 కోట్లు
