పోలీసింగ్ అనేది వృతి కాదు..సేవ ధర్మం. ఇది ధైర్యం నిబద్ధత మానవతా విలువల సమూహహారం అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హితవు పలికారు.మంగళవారం జిల్లా హెడ్ కోటర్ లో పోలీస్ అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న 1959 వద్ద ప్రాణ త్యాగాలు చేసిన పదిమంది సిఆర్పిఎఫ్ లను గుర్తు చేసుకుంటూ దినోత్సవం జరుపుకుంటున్నామని పేర్కొన్నారు.
ఎందరో పోలీస్ సిబ్బంది ప్రగతి అంతర్గత భద్రత కాపాడటానికి నక్సలైట్లు,మతపరమైన విభజన శక్తులు,ఇతర సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ నేరాల అరికట్టడం,మాదక ద్రవ్యాల అణచివేయడానికి,మహిళ భద్రతకు తమ ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు.
వీరి త్యాగాల వల్లనే ఈరోజు దేశం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా నిజామాబాద్ కమిషనరేట్ లో ప్రజల కోసం ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు ఈ నేల చెరగని ముద్ర వేసిందని అన్నారు.
పోలీసు కుటుంబం ఒకటే కుటుంబం వారు వేసుకున్న యూనిఫాం అందరికీ గర్వకారణమని వారి త్యాగాల వల్ల నేడు మనం గర్వంగా బతుకుతున్నామని కొనియాడారు. నిజామాబాద్ పోలీస్ ఎల్లప్పుడు వారి కుటుంబంలో తోడుగా ఉంటుందని ధైర్యాన్ని ఇచ్చారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో మాదక ద్రవ్యాలు, మహిళా భద్రతల పై యువతకు అవగాహన కల్పించి సమాజంలో నేరాలు అరికట్టడంలో మన పోలీసులు ఏప్పుడు ముందంజలో ఉందని అన్నారు.
సాంకేతిక యు గంలో మన పోలీసులు కూడా మార్పు చెందిందని అన్నారు. మన కమిషనరేట్ పరిధిలో ఆధునిక సాంకేతిక, డాటా ఆధారిత వ్యవస్థ, ఏఐలు ప్రవేశపెడుతున్నామని పేర్కొన్నారు. నేరాలు నివారణ, మానవ రక్షణ, పారిదర్శకత వ్యవస్థ కోసం, కానీ అన్నిటికంటే ముఖ్యం మన విలువలు నిజాయితీ సేవ, న్యాయం మన బలమని పేర్కొన్నారు.
ఈ దేశం కోసం న్యాయం కోసం ఎప్పటికీ తలవంచకుండా,పక్షపాతం లేకుండా,సేవా చేయడానికి మన హృదయలతో ప్రమాణం చేద్దామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అడిషనల్ డిసీపీ బస్వా రెడ్డి,జిల్లాలోని సీఐ,ఎస్ఐ పోలీస్ అమర వీరుల కుటుంబాలు పాల్గొన్నారు.
