కుటుంబ సభ్యులు తీర్థయాత్రలకు వెళ్లడంతో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకున్న గుర్తు తెలియని దుండగులు ఆమెను హత్య చేసి,ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. స్థానికుల, పోలీసులు సమాచారం మేరకు..
కామారెడ్డి జిల్లా తాఢ్వాయి మండలం పోల్కంపేట గ్రామానికి చెందిన సులోచన (75)వృద్ధురాలు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న విషయాన్ని దుండగులు గమనించి పథకం ప్రకారం ఇంట్లోకి చొరబడిన దుండగులు ఆమెపై దాడి చేసినట్లు తెలిసింది.
ఈ దాడిలో వృద్ధురాలు ప్రాణాలు కోల్పోగా, నిందితులు ఆమె శరీరంపై ఉన్న సుమారు రూ.5 లక్షల విలువ గల బంగారు పుస్తెలతాడు, చెవి కమ్మలు, చేతి ఉంగరాన్ని అపహరించుకుని పరారయ్యా
