HomeCRIMEపోలీసు శాఖ లో ప్రణీత్ ప్రకంపనలు .........ట్యాపింగ్ గుట్టు విప్పుతున్నాడా ? పరారీలో మాజీ ఇంటిలిజెన్స్...

పోలీసు శాఖ లో ప్రణీత్ ప్రకంపనలు ………ట్యాపింగ్ గుట్టు విప్పుతున్నాడా ? పరారీలో మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ ….ఐన్యూస్ యండి కూడా ……పోలీసు అధికారుల ఇండ్లలో సోదాలు..

ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పోలీసు శాఖను కుదిపేస్తోంది. ఈ కేసులో  విచారణ ప్రక్రియ కీలక మలుపు తీసుకుంది. కస్టడి లో ఉన్న డిఎస్పీ ప్రవీణ్ రావు ట్యాపింగ్ గుట్టు ఒక్కటీ విప్పుతున్నారు. ఆయన ఇచ్చిన సమాచారమేరకే శనివారం ప్రత్యేక బలగాలు పలువురు పోలీసు అధికారుల ఇండ్లలో సోదాలతో విరుచుకపడ్డారు. మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఇంట్లోనూ సోదాలు జరిపారని సమాచారం కానీ కానీ ఆయన దాడులవిషయం ముందే తెలిసి విదేశాలకు పారిపోయినట్లుగా పోలీస్ శాఖలో ప్రచారం జరుగుతుంది. ఆయన ఆదేశాలమేరకు ట్యాపింగ్ వ్యవహారం జరిగిందని ప్రణీత్ రావు విచారణలో వెల్లడించారు.

మరో వైపు ఐ న్యూస్ యం డి శ్రవణ్ కుమార్ సైతం ఈ ముఠా లో అత్యంత క్రియాశీలకంగా పనిచేశారని వెల్లడి అయింది. దీనితో పోలీసులు శుక్రవారం రాత్రే ఆయన ఇల్లు కార్యాలయంలో సోదాలు చేసి పెద్దఎత్తున పెన్ డ్రైవ్ లు ల్యాప్ టాప్ లో కీలక సమాచారం రాబట్టారు. కానీ ఆయన మాత్రం పోలీసులకు చిక్కలేదు. ప్రణీత్ పట్టుబడిన తర్వాత యూరప్ ట్రిప్ కు వెళ్లారని పోలీసుల విచారణలో తేలింది.

ప్రభాకర్ రావు బృందంలో పనిచేసిన భుజంగరావు ,రాధాకిషన్ రావు తిరుపతన్న లను లక్ష్యంగా చేసుకొని శనివారం తెల్లవారు జామున వారి ఇండ్లల్లో ప్రత్యేక పోలీసు బృందాలు దాడులు చేసాయి.గత ప్రభుత్వంలో పెద్దలుగా చెలామణి అయిన వారికి . సైతం ఉచ్చుబిగించే యోచనలో పోలీసు శాఖ యూఉంది. మొదట విషయాలు వెల్లడించడానికి ససేమిరా అన్న ప్రణీత్ ఇప్పుడిప్పుడే విస్తుగొలిపే విషయాలు చెప్తున్నాడు.మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు ఇంటితో పాటు పలువురు మాజీ అధికారుల ఇళ్లలో సోదాలు జరిపినా ఎలంటి ఆధారాలు లభ్యం కాలేదు.

ఆయన మాత్రం అజ్ఞాతంలో ఉన్నారు. ఫలితాలు వచ్చిన మరుసటి రోజే అమెరికా వెళ్లారని ప్రచారం జరుగుతుంది. ఇంటెలిజెన్స్ మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు, ఎస్ఐబీ డిఎస్పీ తిరుపతన్న, హైదరాబాద్ సిటీ మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధా కిషన్ రావులను ట్యాపింగ్ కేసులో నిందితులుగా చేర్చే పనిలో ఉన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments