ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టు అయిన ఎమ్మెల్సీ కవిత సమీప బంధువుల ఇళ్లలో శనివారం ఈడీ సోదాలు నిర్వహించింది. రేపటి తో కవిత ఈడీ కస్టడీ విచారణ పూర్తిఅవుతుంది.గత అయిదు రోజులుగా ఈడీ ఆమెను ఢిల్లీ కార్యాలయంలో విచారిస్తుంది.ఆమె ఇచ్చిన సమాచారం మేరకే హైదరాబాద్‌లో ఈడీ అధికారులు మరోసారి సోదాలు ప్రారంభించారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంధువుల ఇళ్లే టార్గెట్‌గా దాడులు జరుపుతున్నారు. శనివారం తెల్లవారుజాము నుంచే మాదాపూర్‌లోని కవిత ఆడపడుచు అఖిల నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. అంతేకాదు.. కవిత భర్త అనిల్ కుమార్ బంధువుల ఇళ్లలోనూ విస్తృతంగా సోదాలు జరుపుతున్నారు.
కానీ కవిత మెట్టినిల్లు అనిల్ సొంత ఊరు నిజామాబాద్ లోనూ బంధువులు అప్రమత్తం అయ్యారు. నిజామాబాద్ లోఅనిల్ ఇంట్లో మాత్రం ఎలాంటి సోదాలు జరగలేదు.