మంత్రాల నేపంతో మహిళను కిరాతకంగా హత్య చేసిన కేసులో నిందితులకు 14 ఏళ్ళ జైలు శిక్ష విధిస్తు డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ జడ్జి సునీతా కుంచాల తీర్పు చెప్పారు. ఆర్మూర్ పట్టణ శివారులోని మామిడిపల్లి కి చెందిన చిత్ర ఒంటరిగా నివాసం వుంటుంది. ఆమె బాగోగులు చూసుకోవడానికి చెల్లి కొడుకు వెంకటేష్ తరుచు చిత్ర ఇంటికి వచ్చివెళ్లేది. చిత్ర అనారోగ్యం తో బాధపడేది. ఆమె ఇంటి వెనుక ఉండే భారతి చేత బడులు చేయడం వల్లే తాను ఆనా రోగ్యం కు గురి అవుతున్నని అనుమానం పెంచుకుంది. అదే విషయం వెంకటేష్ తో నూ చెప్పింది.
దీనితో ఎలాగైనా భారతి ని హత్య చేయాలనీ నిర్ణయానికి వచ్చారు. అదే ప్రాంతానికి చెందిన స్నేహితులు రంజిత్ రాజేందర్ లతో కలిసి పథకం వేశారు. 2018 జులై 8 న చిత్ర ఇంటి వెనుక నుంచి భారతి ఇంట్లోకి చొరబడ్డారు. నిద్రలో ఉన్న ఆమె ను గట్టిగా పట్టుకొని కత్తి తో గొంతు కోసేశారు. భారతి అక్కడిక్కడే మృతి చెందింది. ఆర్మూర్ పోలీసులు కేసు నమోదు చేసి నలుగురు పాత్ర ను గుర్తించి అభియోగాలు నమోదు చేసారు.
పోలీసుల పక్షనా పీపీ రవిరాజ్ వాదనలు వినిపించారు. నిందితుల మీద అభియోగాలు రుజువు కావడంతో 14 ఏళ్ళ జైలు శిక్ష ఖరారు చేసారు మరో రెండు వేల రూపాయల జరిమానా వేశారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలలు శిక్ష అనుభవించాలని జడ్జి తీర్పు ప్రకటించారు