ఓట్ల కోసమే ఎంపీ అర్వింద్ మరోసారి నిజాం షుగర్ ఫ్యాక్టరీ బాండ్ పేపర్ డ్రామా ఆడుతున్నారన్నారు. ఎంపీగా గెలవకముందు షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని పాదయాత్ర చేశారని, గెలిచిన తర్వాత ఫ్యాక్టరీని ప్రైవేట్ భాగస్వామ్యంలో తెరిపిస్తానని ఆనాడే హామీ ఇచ్చి చెరుకు రైతులను మోసం చేసిన చరిత్ర ధర్మపురి అరవింద్ ది అని అన్నారు. ఎంపీ అరవింద్ కాలం చెల్లింది, ఆయన ఓటమి ఖాయం అయ్యిందన్నారు.
హామీలు ఇచ్చి మోసం చేయడంలో సీఎం రేవంత్ ఎంపీ అరవింద్ ఒక్కటే అని గుర్తు చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో ఐదు రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని ,పసుపు బోర్డు పేరుతో ఎంపీ అరవింద్ రైతులను మోసం చేశారు అన్నారు. ప్రధాని మోడీ చేత ప్రకటన చేయించిన ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు ఎక్కడ పెట్టారో చూపెట్టి ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు.జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో సత్సంబంధాలు ఉన్నాయని, జగిత్యాల జిల్లాలో కోరుట్లకు తనకు అవినావ భావ సంబంధం ఉందన్నారు. ప్రజలు, కార్యకర్తల మద్దతుతో ఎంపీగా గెలుస్తానని బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.