ఎండు మిర్చి రైతులకు గట్టి ఎదురు దెబ్బ – పెట్టుబడికూడా రాబట్టలేని దుస్థితిఎండు మిర్చి రేటు రాలిపోయింది… కన్నీళ్లలో రైతుల కలలు!మిర్చి మార్కెట్‌లో ధర పతనం – ఎండు మిర్చి రైతులకు తీవ్ర నష్టం
రైతులను కన్నీళ్లతో ముంచుతున్న ఎండు మిర్చి ధర పతనం ఎండు మిర్చి ధరలు రోజురోజుకు క్షీణిస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెట్టుబడికి అయిన ఖర్చును కూడా రాబట్టలేని స్థితి నెలకొంది.
గత ఏడాది ఇదే సీజన్లో క్వింటాల్‌కు గరిష్ఠంగా ₹23,000 పలికితే, ప్రస్తుతం ₹15,000ను కూడా దాటడం లేదని రైతులు వాపోతున్నారు.
వ్యవసాయ మార్కెట్లో ఈ వారం గరిష్ఠ ధర ₹14,800గా ఉండగా, తాజాగా ₹14,000కి పడిపోయింది. నిన్న జరిగిన అత్యధిక కొనుగోళ్లు ₹11,000 నుంచి ₹13,000 మధ్యనే జరిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
