HomeCRIMEజిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పైనుంచి దూకిన ఖైదీ

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పైనుంచి దూకిన ఖైదీ

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రెండో అంతస్తు నుంచి ఖైదీ దూకి ఆత్మహత్యాయత్నంఅనారోగ్యంతో చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఓ ఖైదీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది.

నిజామాబాద్‌ సెంట్రల్‌ జైలులో ఖైదీగా ఉన్న లకావత్‌ రాజూను అనారోగ్య పరిస్థితుల్లో ఉదయం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించిన అనంతరం ఆసుపత్రిలో అడ్మిట్‌ చేశారు.ఈ క్రమంలో రాజు ఒక్కసారిగా ఆసుపత్రి రెండో అంతస్తు నుంచి కిందికి దూకాడు.

ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది అతడిని మూడో అంతస్తులోని ఐసీయూకు తరలించారు.

వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments