నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిట్టాపూర్ నుంచి శ్రీరాంపూర్ వెళ్లే మార్గంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో సుమారు 60 ఏళ్ల వయస్సున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
మృతురాలు ఆకుపచ్చ రంగు చీర, పసుపు రంగు జాకెట్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె వివరాలు తెలిసిన వారు బాల్కొండ పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని ఎస్సై శైలేందర్ కోరారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు.
