నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా, మంగళవారం భారీ వర్షం కురిసింది. నగరం సాయంత్రం కురిసిన కుండపోత వానకు రోడ్లన్నీ చెరువులు, కుంటలను తలపించాయి. రోడ్లు అన్ని జలమయం అవ్వడంతో వర్షపు నీటితో డ్రైనేజీలు పొంగిపొర్లాయి.
డ్రైనేజీ రోడ్లపై ప్రవహించడంతో పలు కాలనీలు దుర్గంధంలో చిక్కుకున్నాయి. వరద నీరు రోడ్లపై ప్రవహించి చెరువులను తలపించాయి.
దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.సాయంత్రం ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. అలాగే పలు ప్రాంతాల్లో విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది.
రైల్వే స్టేషన్, బస్టాండ్, కంటేశ్వర్, ముబారక్ నగర్,మాణిక్ బండార్, పూలంగ్, వర్ని చౌరస్తా, సారంగాపూర్, పలు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో ప్రయాణికులు ఇక్కట్లు పడ్డారు.
వివిధ మండలాలుగా,నవీపేట్2.2 మిమి, మోర్తాడు 4.7మిమి, పోతంగల్ 6.5మిమి, కోటగిరి 7.5మిమి, వర్ని 5.3మిమి, ఇందల్వాయి 8.0మిమి, నిజామాబాద్ నార్త్ 5.2మిమి, జిల్లా వ్యాప్తంగా 73.3 వర్షపాతం నమోదైంది.
