HomeCRIMEరామర్తి చెరువును రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కబ్జా...

రామర్తి చెరువును రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కబ్జా…

నిజామాబాద్ నగరంలోని అర్సపల్లిలో గల రామ్మర్తి చెరువును కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కబ్జా చేశారని డివిజన్ ప్రజలు ధ్వజమెత్తారు.

సోమవారం జిల్లా కలెక్టర్ రేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కు ఫిర్యాదు చేశారు.

అర్సపల్లి వృద్ధి కమిటీ అధ్యక్షులు తోటి కూర నరసయ్య మాట్లాడుతూ… అర్సపల్లి రామ్మూర్తి చెరువులో సర్వేనెంబర్ 216 దీని విస్తీర్ణం 29 ఎకరాల 33 గుంటలు కలదని పేర్కొన్నారు. ఈ చెరువు అర్సపల్లి ఊర చెరువుకు గతంలో రిజర్వాయర్ గా ఉపయోగపడేదని గ్రామస్తులు తెలిపారు.

గత 15 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు దీని కబ్జా చేస్తూ అక్రమ కట్టడాలు చేస్తున్నారని 15వ డివిజన్ ప్రజలు పేర్కొన్నారు.

చెరువు కబ్జా విషయంలో కలెక్టర్ కు, ఆర్డిఓకు,తహసీల్దారుకు ఇరిగేషన్ శాఖ అధికారులకు సంబంధిత అధికారులకు అనేకమార్లు వినతి పత్రాలు ఇచ్చిన పట్టించుకోవడంలేదని వాపోయారు. అలాగే గాడు కుంట చెరువు కూడా కబ్జాకు గురిందని పేర్కొన్నారు.

రియల్లీ ఎస్టేట్ అక్రమంగా చెరువులోనూ కబ్జా చేశారని చెప్పారు. ఈ రెండు చెరువులలో నీరు కలుషితమై పశువులు మీరు తాగి రోగాల బారిన పడుతున్నాయని పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments