ఆర్మూర్ మండల పాస్టర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి పాస్టర్స్ భవన్ లో జరిగింది.
నూతన అధ్యక్షునిగా బ్రదర్ రమేష్ జాన్, ప్రధాన కార్యదర్శిగా పాస్టర్ దినకరన్ రాజ్ పాల్, కోశాధికారిగా పాస్టర్ మధు లు ఎన్నికైనారు.
కాగా అధ్యక్షుడు రమేష్ జాన్ ను అసోసియేషన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోగా, కార్యదర్శి, ట్రెజరర్ల ను ఎన్నుభ మాకు కున్నారు. ఎలక్షన్ కమిటీ నిర్వాహకులుగా సునీల్, ప్రభుదాస్, దైవ చిత్తం, ఇమ్మానుయేల్ లు వ్యవహరించారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు రమేష్ జాన్ మాట్లాడుతూ… రానున్న రోజుల్లో క్రైస్తవ సార్వత్రిక సంఘ క్షేమం కోసం పాటుపడతమన్నారు.
తాను ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మండల సంఘ కాపరులు నాయకులు పాల్గొన్నారు.
