HomeHEALTHరెడ్‌క్రాస్‌ ఎన్నికల కోలాహలం..ముగిసిన ప్రచార పర్వం.. ప్రారంభమైన పోలింగ్‌..పోటాపోటీగా సాగిన ప్రచారానికి తెర.. ఫలితాలపై ఉత్కంఠ

రెడ్‌క్రాస్‌ ఎన్నికల కోలాహలం..ముగిసిన ప్రచార పర్వం.. ప్రారంభమైన పోలింగ్‌..పోటాపోటీగా సాగిన ప్రచారానికి తెర.. ఫలితాలపై ఉత్కంఠ

రెడ్‌క్రాస్‌ సొసైటీ ఎన్నికల కోలాహలం మొదలైంది. కొద్ది రోజులుగా పోటాపోటీగా సాగిన ఎన్నికల ప్రచారానికి తెరపడటంతో ఆదివారం ఉదయం 8 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. ఈసారి రెడ్‌క్రాస్‌ ఎన్నికలు సాధారణ ఎన్నికలకు భిన్నంగా రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

స్వచ్ఛంద సంస్థ ఎన్నికలు అయినప్పటికీ వివిధ రాజకీయ వర్గాలకు చెందిన నేతలు, అనుచరులు తమకు అనుకూలమైన ప్యానళ్లకు మద్దతుగా నిలిచినట్లు ప్రచారం జరిగింది. దీంతో ఎన్నికల ప్రచారంలోనూ రాజకీయ వాతావరణం కనిపించింది. కాంగ్రెస్‌, బీజేపీ వర్గాలకు చెందిన నేతల మద్దతు కూడా ఈ ఎన్నికలపై ఆసక్తిని పెంచింది.

రెండు ప్యానళ్ల అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేయగా.. ఇప్పుడు వారి భవితవ్యం ఓటర్ల తీర్పుపై ఆధారపడింది. దీంతో ఫలితాల కోసం అభ్యర్థులు, వారి మద్దతుదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెడ్‌క్రాస్‌ సొసైటీ ఎన్నికల్లో మొత్తం 9,826 మంది ఓటర్లు ఉండగా.. రెండు ప్యానళ్ల నుంచి 29 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థులు, ప్యానళ్ల ప్రతినిధులు ఓటర్లను కలిసి తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. రోజురోజుకూ ప్రచారం ఊపందుకోవడంతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ప్రచార పర్వానికి శనివారంతో ఫుల్‌స్టాప్‌ పడగా.. ఆదివారం ఉదయం నుంచి అసలు ఘట్టమైన పోలింగ్‌ మొదలైంది.

ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దీంతో పోలింగ్‌ కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల అధికారిగా జిల్లా సహకార అధికారి శ్రీనివాస్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఆయన పర్యవేక్షణలో పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. పోలింగ్‌ పూర్తయిన అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. దీంతో ఎవరి ప్యానల్‌కు సభ్యుల మద్దతు దక్కిందన్నది ఫలితాల వరకు ఉత్కంఠగా మారింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments