సామాజిక సేవా దృక్పథంతో పనిచేసే అభ్యర్థులను ఇండియన్ రెడ్‌క్రాస్ నిర్వహణ కమిటీ ఎన్నికల్లో గెలిపించాలని ఇందూరు సేవా సమితి సభ్యులు కోరారు.
ఆదివారం జరగనున్న ఎన్నికల నేపథ్యంలో శనివారం నగరంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పాలిటెక్నిక్ కళాశాల, ఈటీ మైదానాల్లో ఉదయం వేళల్లో నడకకు వచ్చే వారితోపాటు కలెక్టరేట్, విద్యుత్ శాఖ కార్యాలయం, సరస్వతీనగర్, ప్రగతినగర్ ప్రాంతాల్లో ఉద్యోగులు, వైద్యులు, వ్యాపారవేత్తలను కలిసి ఓట్లు అభ్యర్థించారు.
ఇందూరు సేవా సమితి బలపరుస్తున్న అభ్యర్థి న్యాయవాది మల్లెపూల జగన్‌మోహన్‌గౌడ్ మాట్లాడుతూ ప్రజా సేవే లక్ష్యంగా రెడ్‌క్రాస్ కార్యక్రమాలను జిల్లాలో మరింత విస్తృతం చేయాలనే ఉద్దేశంతో ఎన్నికల బరిలో నిలిచినట్లు తెలిపారు. సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చే అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
అక్టోబర్ 4న హరిచరణ్ మార్వాడీ పాఠశాలలో జరిగే ఎన్నికల్లో రెడ్‌క్రాస్ సభ్యులు పాల్గొని తమ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.ప్రచారంలో అభ్యర్థులు రంజిత్‌సింగ్, పోతంకల్ లక్ష్మీనారాయణ, యాదగిరి, నాగరాజు, ఎండల సుధాకర్, బాలాజీ, పురుషోత్తంరెడ్డి, లక్ష్మణ్, శివాజీ, సుభాష్, సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
