HomeTelanganaNizamabadబీడీ కార్మికులపై ‘రూ.10’ భారం..దేశాయి బ్రదర్స్‌ యాజమాన్యంపై చర్యలకు డిమాండ్‌..లేబర్‌ అధికారుల తీరుపైనా విచారణ జరపాలితెలంగాణ...

బీడీ కార్మికులపై ‘రూ.10’ భారం..దేశాయి బ్రదర్స్‌ యాజమాన్యంపై చర్యలకు డిమాండ్‌..లేబర్‌ అధికారుల తీరుపైనా విచారణ జరపాలితెలంగాణ ప్రగతిశీల బీడీవర్కర్స్ యూనియన్ రాజకీయ, బీడీవర్కర్స్ యూనియన్ జెఏసి..రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ కు వినతి పత్రం అందజేత

బీడీ కార్మికుల నుంచి వెయ్యి బీడీలకు రూ.10 చొప్పున అదనంగా వసూలు చేస్తున్న దేశాయి బ్రదర్స్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌, బీడీ వర్కర్స్‌ యూనియన్‌ జేఏసీ డిమాండ్‌ చేశాయి.

ఈ మేరకు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. యాజమాన్యంపై పలుమార్లు ఫిర్యాదులు, ఆందోళనలు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని నాయకులు ఆరోపించారు.

రాష్ట్రంలోని నిజామాబాద్‌, కామారెడ్డి, కరీంనగర్‌, మెదక్‌, నిర్మల్‌, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌ తదితర జిల్లాల్లో బీడీ పరిశ్రమపై లక్షలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా మహిళా కార్మికులు బీడీలు చుట్టి జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు.

ఇప్పటికే పని దినాలు తగ్గి ఆదాయం పడిపోయిన పరిస్థితుల్లో అదనపు వసూళ్లతో కార్మికులపై మరింత భారం పడుతోందన్నారు. దేశాయి బ్రదర్స్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సిన లేబర్‌ అధికారులు తూతూమంత్రంగా వ్యవహరిస్తున్నారని జేఏసీ కన్వీనర్‌ అన్వేష్‌రెడ్డి, వి.ప్రభాకర్‌ ఆరోపించారు.

యాజమాన్యంతో అధికారులు కుమ్మక్కయ్యారన్న ఆరోపణలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. కార్మికుల సమస్యలపై నిర్వహించిన సమావేశాలు కూడా ఫలితం లేకుండా పోయాయని అన్నారు.

బీడీ కార్మికుల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తహెర్‌ బిన్‌ హందాన్‌ మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ నిజామాబాద్‌-కామారెడ్డి సంయుక్త జిల్లా అధ్యక్షుడు ఎం.ముత్తెన్న, ప్రధాన కార్యదర్శి ఆర్‌.రమేష్‌, ఉపాధ్యక్షురాలు వి.సత్తెమ్మ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments