Thursday, April 16, 2026
HomePOLITICAL NEWSరాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి రికార్డు నెలకొల్పిన రేవంత్ సర్కార్..-స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా...

రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి రికార్డు నెలకొల్పిన రేవంత్ సర్కార్..-స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలు..-కాంగ్రెస్ పాలనలో అనాధాలా నిజామాబాద్ జిల్లా- -బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి


కాంగ్రెస్ ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానమంటూ లేకుండా ఇష్టాను సారంగా తెస్తున్న అప్పు తెలంగాణ రాష్ట్రానికి ముప్పుగా పరిణమిస్తోందని
బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

నిజామాబాద్ లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తూ సరికొత్త రికార్డులు నెలకొల్పు తోందని మండి పడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వంఅన్ని వర్గాల ప్రజల నోట్లో మట్టికొట్టిందని, అప్పు తేనిదే పూట గడవదన్న రీతిలో విచ్ఛిన్నకర పాలన సాగిస్తోందని ఆయన ధ్వజమెత్తారు.
తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 20 నెలల కాలంలో రూ.2.2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది.

ప్రతీ నెలా రూ. 11వేల కోట్లు, రోజుకు రూ. 360 కోట్లు, గంటకు రూ. 15కోట్లు, ప్రతి నిమిషానికి రూ. 25లక్షల చోప్పున అప్పులు చేసి ఒక కొత్త పథకం చేపట్టిన పాపాన పోలేదు. మరి ఆ రూ. 2.2 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినయి అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. తెచ్చిన అప్పులతో ఒక్క ప్రాజెక్టు కట్టలేదు, తట్టెడు మట్టి ఎత్తలేదని ఆయన ఎద్దేవా చేశారు.


కనీసం ఒక్క ఎన్నికల హామీని కూడా అమలు చేయలేద న్నారు.
కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో చేసిన అప్పు కేవలం రూ.2.8 లక్షల కోట్లు మాత్రమేనని,
సమైక్య రాష్ట్రం నుంచి వచ్చిన రూ.75వేల కోట్లతో కలిపి మొత్తం రూ. 3.5 లక్షల కోట్లే తెలంగాణ అప్పు అని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించడం ఇంత కాలం విష ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ కు చెంప పెట్టు అని ఆయన పేర్కొన్నారు.


పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం సృష్టించిన ఆస్తుల విలువ రూ. 4.16 లక్షల కోట్లు అని ఆయన వెల్లడించారు.
కాంగ్రెస్ సర్కార్ అంటే ప్రతీ ఇంట్లో సంక్షోభం, ప్రతీ కంట్లో విషాదం అన్నట్టుగా ఉందని ఆయన అన్నారు.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఆటకెక్కాయని, 420 హామీలు బుట్టదాఖా లయ్యాయని జీవన్ రెడ్డి పేర్కొంటూ
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఏ ఒక్క వర్గం వారికి ఏమిచ్చారో చెప్పే దమ్ముందా? అని నిలదీశారు.


రైతులకు రుణమాఫీ అమలు కాలేదని, రైతుభరోసా రాలేదని,
మరణించిన రైతు కుటుంబాలకు రైతుబీమా ఇవ్వడం లేదని, కరెంటు ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని,
చేనేత కార్మికులు మళ్లీ సమస్యల పాలవుతున్నారని,
గీత కార్మికులకు సర్కార్ భరోసా లేదని ఆయన తెలిపారు.20 నెలలు తిరగక ముందే
పాలన చేతకాక చేతులెత్తేసి
లేకి కూతలు కూస్తున్నడని,
తెలంగాణ పరువును బజారున పడేస్తున్నడని ఆయన మండిపడ్డారు.


కేసీఆర్ పదేళ్ల పాలనలో పెట్టుడు తప్ప తిట్టుడు లేదన్నారు.ఇక నిజామాబాద్ జిల్లా ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు.
పట్టించుకునే దిక్కులేక జిల్లా అనాధాల మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.


జిల్లాకు మంత్రి లేరని, జిల్లా ప్రజలు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ నుంచే ఉన్నా ఆయన ఏ నాడూ జిల్లాను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ లు ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియా అవతారమెత్తి దోచుకునే పనిలో బిజీబిజీగా గడుపుతున్నారని ఆయన ఆరోపించారు.


ఈ నికృష్ణ కాంగ్రెస్ పోయి మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే మంచిదని తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా రెప రెప లాడటం ఖాయమని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రభాకర్,సుజీత్ సింగ్ ఠాకూర్,రాజేశ్వర్ రెడ్డి, మాస్తప్రభాకర్,ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు పూజ నరేందర్,శ్రావణ్,పృథ్వి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!