ఫిలింనగర్ పద్మాలయా అంబేద్కర్ నగర్ లో అక్రమ కట్టడాలను అడ్డుకున్న రెవెన్యూ సిబ్బంది.వివరాలలోకి వెళ్తే పద్మయా అంబేడ్కర్ నగర్ బస్తీలో తరుచు అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉండటం సర్వసాధారణం .
ఈ బస్తీలో ప్రభుత్వ భూమి చాలా ఉంది. ప్రభుత్వ పాఠశాల అనుకోని ఉన్నా ఖాళీ స్థలాలలో మళ్ళీ అక్రమ కట్టడాలు వెలిశాయి.
ఈ విషయాన్ని స్థానికులు షేక్‌పేట ఎమ్మార్వో ఫిర్యాదు చేశారు. TS No. 1, Block-F, WardNo -9 సంబంధించి సర్వే నెంబర్ 403 షేక్ పెట్ విలేజ్ పద్మల అంబేద్కర్ నగర్ ప్రభుత్వ స్థలంలో డొక్కా ఉమా w/o డొక్కా సురేష్ సంబంధించి 50 గజాల స్థలం వారికి ఉండగా పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని కలుపుకొని సుమారుగా 180 గజాల స్థలాన్ని ఆక్రమించడం జరిగింది.
అయితే ఈ 50 గజాల స్థలం సామ్ సంబంధించి ఎలాంటి పత్రాలను సదరు కబ్జా దారులు చూపించలేకపోయారు. దీనితో షైక్పేట్ ఏమ్మార్వో వై. అనిత రెడ్డి, ఈ అక్రమ నిర్మాణం మొత్తం తొలగించారు.
ప్రభుత్వ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేసిన వారిపై చట్టరీత్య చర్యలు తీసుకుంటామని రెవిన్యూ సిబ్బంది తెలిపారు.
