ఆర్మూర్: ఆర్మూర్ పట్టణ శివారులో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎన్‌హెచ్-63పై పెర్కిట్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో రాంగ్ రూట్‌లో వేగంగా వచ్చిన లారీ, ఆర్టీసీ బస్సును అదుపుతప్పి ఢీకొంది.
ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు గాయపడ్డారు. సబ్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ వివరాల ప్రకారం, లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడంతోనే ప్రమాదం జరిగిందని తెలిపారు.
గాయపడినవారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి, విచారణను ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
