ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్ కౌంటర్ ఎన్‌కౌంటర్ జరిగింది. మొత్తం 31 మంది మావోయిస్టులు మృతి చెందిన ట్లు బస్తర్ ఏరియా ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు. ఈ ఘటనలో ఇద్దరు కోబ్రా జవాన్ లు మృతి చెందారు.
బీజాపూర్ నేషనల్ పార్క్ సమీపంలోని అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని ఆయన వెల్లడించారు.ఆదివారం తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది .
బీజపూర్లో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఆదివారం తెల్లవరుజామున బీకర కాల్పులు జరగగా.. భారీ సంఖ్యలో మావోలు, భద్రతా బలగాలు గాయపడ్డారు. బీజాపూర్ లోని ఇంద్రావతి నేషనల్ పార్కు అటవీ ప్రాంతంలో పశ్చిమ బస్తర్ డివిజన్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భేటీ జరుగుతున్నట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో..
డీఆర్‌జీ, సీఆర్పీఎఫ్, కోబ్రా యూనిట్, ఎస్‌టీఎఫ్ కు చెందిన 3500 మంది బలగాలు యాంటీ నక్సలైట్ ఆపరేషన్ చేపట్టాయి.ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 31 మంది మావోయిస్టులు అక్కడిక్కడే హతం కాగా..
ఇద్దరు సైనికులు కూడా మృతి చెందారు. అదేవిధంగా గాయపడిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య కూడా ఇంకా పెరగనుందని సమాచారం. కాగా కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని భద్రతా బలగాల అధికారులు పేర్కొన్నారు.
31 మందిలో 18 పురుషులు, 13 మహిళలు ఉన్నారని సమాచారం . చనిపోయిన 16 మంది నక్సలైట్లపై రూ. 1 కోటి 30 లక్షల రూపాయలకు పైగా రివార్డు ఉందని గుర్తించారు.
మరో 15 మంది మావోయిస్టుల గుర్తింపు కోసం చర్యలు చేపట్టారు. మృతదేహాలను నారాయణపూర్ జిల్లా కేంద్రానికి తరలించారు
