కామారెడ్డి శివారు లోని లింగా పూర్ నివాసముండే బండారి రాజరెడ్డి (56) అదే కాలనీకి చెందిన తండ్రీకొడుకు హత్య చేసినట్లు స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం రాజిరెడ్డి ఈ నెల 29న రాత్రి 7 గంటల ప్రాంతంలో మంచాల ఎల్లయ్య అనే వ్యక్తి ఇంటి దగ్గర కనిపించారు. అప్పటి నుంచి రాజిరెడ్డి కనిపించకుండా పోయారు.
ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు రాజిరెడ్డి ఆచూకీ కోసం వెతకసాగారు. అయితే అదే కాలనీ పరిధి లోని ఓ ఫంక్షన్ హాల్ సమీపంలో రాజిరెడ్డికి చెందిన ద్విచక్రవాహనం, సెల్ ఫొన్ లు కనిపించాయి. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు దేవునిపల్లి పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ద్విచక్రవాహనాన్ని, సెల్ ఫొన్ లను స్వాధీనం చేసుకున్నారు. లభించిన సెల్ ఫొన్ ఆధారంగా పోలీసులు విచారణను ప్రారంభించారు.
పోలీసుల విచారణలో మంచాల ఎల్లయ్య, అతడి కొడుకు ప్రణీత్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించగా.. రాజిరెడ్డిని తామే హత్య చేసి బావిలో పూడ్చి పెట్టామని అంగీకరించారు.
శనివారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో అనుమానితులు పూడ్చిపెట్టిన రాజిరెడ్డి మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. రాజిరెడ్డి-ఎల్లయ్య కలిసి కొనుగోలు చేసిన భూమిలో నెలకొన్న వివాదమే ఈ హత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది.
